Braking: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు – కర్నూలు ప్రధాన రహదారిపై నరసరావుపేట నుండి వినుకొండ రోడ్డు వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మొత్తం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ ద్వారా వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరో వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తొంది. ఆటోలో ప్రయాణిస్తున్న వీరంతా గుంటూరుకు చెందిన అర్కిస్ట్రా బృందంగా తెలుస్తొంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమిలి ఎలక్షన్ ప్రక్రియ పై స్పీడ్ పెంచిన కేంద్రం .. అధ్యయనానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు