NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Nara Lokesh: పాదయాత్ర పునః ప్రారంభానికి సిద్దమవుతున్న నారా లోకేష్ కు జగన్ సర్కార్ ఝలక్ .. అరెస్ట్ ఖాయమే(గా)..?

Share

Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేయడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన లోకేష్ .. చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను జాతీయ స్థాయి నేతలకు తెలియడంతో పాటు చంద్రబాబును జైల్ నుండి బయటకు తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. దాదాపు రెండు వారాల నుండి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు అంశాన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూల్లోనూ వెల్లడించారు. పలువురు నేతలను కలిసి జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వివరించారు లోకేష్. పార్లమెంట్ ఆవరణలో పలువురు ఎంపీలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పెద్దలతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కానీ వారి అపాయింట్మెంట్ లు లభించలేదని తెలుస్తొంది.

మరో పక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతున్నామని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించడంతో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే సీఐడీ అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లిందని కూడా ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు కూడా లోకేష్ అరెస్టుపై మాట్లాడారు. ఏపీలో ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఢిల్లీలోనే ఉండిపోయాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ లోనూ లోకేష్ పై అభియోగాలు ఉన్నట్లుగా వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడం ఆలస్యం అవుతుండటంతో వచ్చే వారం నుండి యువగళం పాదయాత్రను పునః ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు లోకేష్.

Nara Lokesh Padayatra

ఈ తరుణంలో నారా లోకేష్ పేరును అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ కేసులో సీఐడీ చేర్చడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో లోకేష్ పేరును ఏ 14 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో లోకేష్ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలు ఏమిటి..? ఏ కోణంలో చేర్చారు? తదితర విషయాలను సీఐడీ వెల్లడించాల్సి ఉంది. సీఐడీ మెమోపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిపి రేపటికి వాయిదా వేసింది. లోకేష్ పేరును ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడుగా చేర్చడంతో ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లోకేష్ ను యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి ముందే సీఐడీ అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తొంది. ఏదో ఒక కేసులో లోకేష్ ను కూడా అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అయితే లోకేష్ ను ఢిల్లీలో అరెస్టు చేయాలా? లేక యువగళం ప్రారంభించడానికి ఏపీకి వచ్చిన తర్వాత అరెస్టు చేయాలా ? అన్న సంశయంలో సీఐడీ అధికారులు ఉన్నారని అంటున్నారు. త్వరలో  లోకేష్ అరెస్టు ఖాయమే అన్న మాటలు మాత్రం వినబడుతున్నాయి. చూడాలి సీఐడీ ఏ విధమైన స్టెప్ తీసుకుంటుందో..!

Chandrababu Arrest: చంద్రబాబు కేసులు మళ్లీ వాయిదా .. విచారణ ఎప్పుడంటే ..


Share

Related posts

ఎమ్మెల్సి‌ల్లోనూ టిఆర్‌ఎస్ హవా

somaraju sharma

ఆ నగరానికి ఏమైంది! ఏమిటీ నేరాలు.. ఘోరాలు?

Yandamuri

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అవినాష్ లైఫ్ స్టయిలే మారిపోయింది?

Varun G