ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు కోర్టులో మరో సారి చుక్కెదురు..!!

Share

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు సికింద్రాబాద్ కోర్టులో మరో సారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. ప్రవీణ్ రావు సోదరుల అపహారణ కేసులో అఖిలప్రియను ఈ నెల 6వ తేదీన అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పురోగతి కోసం ఈ నెల 12వ తేదీ నుండి మూడు రోజుల పాటు కస్టడీలోకి పోలీసులు విచారించారు. కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదనీ, పోలీస్ కస్టడీ విచారణ పూర్తి అయనందున బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో అఖిలప్రియ కోరారు.

కిడ్నాప్ కేసులో ఏపి మాజీ మంత్రి అఖిలప్రియ మరో సారి చుక్కెదురు..బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సికింద్రాబాద్ కోర్టు
Secunderabad court dismisses Akhilapriya’s bail petition

అయితే అఖిలప్రియపై నమోదు చేసిన కేసులో పోలీసులు అదనపు సెక్షన్ లు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకాయిట్ నమోదు చేసిన పోలీసులు అఖిలప్రియకు బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్ దాఖలు చేశారు.  ఈ కేసులో ఇతర నిందితులైన భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను మరి కొందరు పరారీలో ఉన్నారని పోలీసులు కౌంటర్ పిటిషన్ లో వెల్లడించారు. అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర నిందితులు దొరికే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..జీవిత కాలం శిక్షపడే కేసులు తమ పరిధిలోకి రావని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అఖిలప్రియ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Share

Related posts

Heart Stroke: హార్ట్ స్ట్రోక్ ఎన్ని రకాలు.. ? వాటి వివరాలు ఏమిటంటే..?

bharani jella

క్రికెట్ ప్రియుల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్యాక్‌.. ఉచితంగా హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్..

Srikanth A

చరణ్ రంగస్థలం మించి ఉంటుంది.. అందుకే సాయితేజ్ కమిటయ్యాడు ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar