NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu: గుడివాడలో టీడీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేసిన చంద్రబాబు – కొడాలి నాని ని ఓడించేది ఇతనే ?

Advertisements
Share

Chandrababu: రాబోయే ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలవాలని భావిస్తున్న కీలక నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిగా వినబడే నియోజకవర్గం గుడివాడ. ఎందుకంటే .. ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులకు శతృవుగా మారారు. పార్టీ మారినా రాజకీయంగా విమర్శలు చేస్తే ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ కొడాలి నాని మాత్రం చాలా కాలంగా చంద్రబాబు, లోకేష్ లను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Advertisements

చంద్రబాబు, లోకేష్ లపై కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకే సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఈ సారి గుడివాడ విషయంలో పక్కా ప్లానింగ్ తో అభ్యర్ధి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ కొడాలి నానికి ఓటమిని రూచి చూపించాలని ఫిక్స్ అయ్యారు.

Advertisements

ఎందుకంటే.. కొడాలి నాని గుడివాడలో ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. తొలుత 2004, 2009 లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన కొడాలి నాని.. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నానిని ఢీకొట్టేందుకు చంద్రబాబు ఒక వైపు పార్టీ క్యాడర్ కు దిశా, నిర్దేశం చేస్తూ మరో వైపు బలమైన అభ్యర్ధిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్ధి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలుస్తొంది.

ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును ఎంపిక చేసినట్లు సమాచారం. అర్ధ బలం, అంగ బలం ఉన్న వెనిగళ్ల రాము అయితే కొడాలి నానికి బలమైన ప్రత్యర్ధి అవుతారని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. రామును అభ్యర్ధిగా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రావికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లుగా తెలుస్తొంది. వెనిగళ్లకు రావి సహకారం అందిస్తేనే నానిని ఓడించడం సాధ్యం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తొంది. అయితే ఇంత కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న రావికి గత ఎన్నికల్లో సీటు కేటాయించకుండా ఈ సారి కూడా హ్యాండ్ ఇస్తే సహకరిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

టీడీపీలో రావి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకుడు. 2000 సంవత్సరంలోనే గుడివాడ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ ఒత్తిడితో రావిని పక్కన పెట్టి కొడాలి నానికి టికెట్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ కొడాలి నానిపైనే టీడీపీ నాయకత్వం మొగ్గు చూపడంతో రావి టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. 28వేలకుపైగా సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రావికి దక్కింది. కొడాలి నాని చేతిలో 11వేల వేలకుపైగా తేడాతో ఓటమి పాలైయ్యారు రావి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రావిని పక్కన పెట్టి దేవినేని అవినాష్ కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. నాని చేతిలో అవినాష్ 19వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యాడు. ఆ తర్వాత అవినాష్ వైసీపీలో చేరారు.

ఆ తర్వాత రావికే పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. ఈ సారి తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో రావి వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నాలుగేళ్లుగా పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉన్నారు. అయితే నాని దూకుడు వ్యవహారం ముందు రావి వెంకటేశ్వరరావు సరిపోడన్న అభిప్రాయం టీడీపీ అధిష్టానంలో ఉంది. అందుకే ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముకు ముందుగా పని చేసుకోమని చెప్పడంతో గత కొంత కాలంగా యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలకు, పార్టీ క్యాడర్ కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా లోకేష్ పాదయాత్రలోనూ వెనిగళ్ల చురుగ్గా పాల్గొన్నారు. అందుకే గుడివాడ విషయంలో ఎన్నికల వరకూ వేచి ఉండకుండా ముందుగా అభ్యర్ధి ఎంపిక ప్రకటన చేయాలన్న భావనతో చంద్రబాబు ఉన్నారని సమాచారం. రీసెంట్ గా నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు త్వరలో అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తానని, అందరు సమైక్యంగా పని చేయాలని సూచించారని తెలిసింది.

CM YS Jagan: దేశం మొత్తం ఉలిక్కిపడే బిల్లు ఏపీ అసంబ్లీ లో ప్రవేశపెట్టబోతోన్న జగన్ !


Share
Advertisements

Related posts

ప్రైవేటు తుపాకీ కేంద్రం ప్రారంభం

Siva Prasad

హైద‌రాబాద్ న‌గ‌రానికి ఏమైంది …. ఎంత‌మందికి దిమ్మ‌తిరిగిపోయిందో తెలుసా?

sridhar

కాసేపట్లో కొత్త మంత్రి వర్గం.. పాత మంత్రికి భారీ ట్విస్ట్?

CMR