NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రామచంద్రాపురం వైసీపీ టికెట్ పంచాయతీకి ఎండ్ కార్డ్ .. సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమన్న బోస్

రామచంద్రాపురం వైసీపీ టికెట్ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది. నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (వేణు), రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ (బోస్) వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుండి జగన్ వెంట ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల నియోజకవర్గంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మన స్థాపంతో ఉన్నారు. వేణుకి టికెట్ ఇస్తే తాను గానీ తన కుమారుడు గానీ స్వతంత్రంగా పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించారు బోస్.

YSRCP MP Subhas Chandra Bose U turn

 

అంతకు ముందు నియోజకవర్గంలో పిల్లి వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించి బోస్ తనయుడికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. మంత్రి వేణు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ఆయనకు టికెట్ ఇవ్వడానికి వీలులేదన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లికి బోస్ ను పిలిపించి మాట్లాడారు. వేణుతో కలిపి మాట్లాడతానని చెప్పగా, ఆయనతో కలిసి కూర్చునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ తరుణంలో బోస్ జనసేన లో చేరనున్నారంటూ నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. ఈ కథనాలపై ఇవేళ బోస్ స్పందించారు.

జనసేన వైపు వెళ్తున్నాను అనేది పుకారు మాత్రమేనని బోస్ స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్ నని పేర్కొన్నారు. తాను ఎంపీగా రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని చెప్పాననీ, అది బాధాకరమైన విషయని, ఈ విషయంలో సీఎంకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. రామచంద్రాపురంలో సీఎం పర్సనల్ టీమ్ సర్వే చేసి నివేదిక ఇస్తుందనీ, ఆ సర్వే రిపోర్టు ఆధారంగానే పార్టీ చర్యలు ఉంటాయని, దానికి తాను అంగీకరించినట్లు చెప్పారు. తాను బాధతో మాట్లాడిన మాటలే కానీ పార్టీ మీద కోపం తనకు ఎప్పుడూ లేదని బోస్ పేర్కొన్నారు. బోస్ యూటర్న్ తీసుకోవడంతో రామచంద్రాపురం టికెట్ పంచాయతీకి తెరపడినట్లు అయ్యింది.

Breaking: మైహోమ్స్ సిమెంట్స్ లో ఘోర ప్రమాదం .. 5గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?