NewsOrbit
Big Boss 6 Telugu Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

Advertisements
Share

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ మూడవ తారీకు ఆదివారం షో స్టార్ట్ కాగా… మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో 8 మంది ఉన్నారు. ఈసారి సీజన్ లో అందరూ చూడదగ్గ ముఖాలతో నిండుగా ఉన్నారు. మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ గత సీజన్ లలో … మాదిరిగా కాకుండా ఏదైనా ఇంటి సభ్యులు సంపాదించుకోవాలి అనే రీతిలో రకరకాల టాస్కులు పెడుతున్నారు. కంటెస్టెంట్స్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఈ రీతిగానే వారికి.. టాస్కులు నిర్వహిస్తున్నారు. సోఫా కావాలన్నా ఇంకా తినటానికి ఏదైనా పొందుకోవాలన్నా ముందు నుండి టాస్క్ ఆడాల్సిందే. దానికి తగ్గట్టు బిగ్ బాస్ అనుమతులు ఇస్తున్నారు.

Advertisements

Shivaji gave an unexpected shock to Bigg Boss and scolding

ఈ క్రమంలో సెప్టెంబర్ 7వ తారీకు నాడు కాఫీ విషయంలో.. హౌస్ లో నటుడు శివాజీ రచ్చ రచ్చ చేయడం జరిగింది. ఏకంగా బిగ్ బాస్ మీద అరిచేసాడు. తలుపులు తీసేస్తే ఇంటికి వెళ్ళిపోతానని కెమెరాల ముందు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ప్రోమోలో చూపించడం జరిగింది. ఇంతకీ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక ముందుగానే తాను యాక్ట్ చేస్తున్నట్లు కెమెరాల ముందు.. చెప్పిన శివాజీ తనకు కాఫీ పంపించటం లేదన్న వంకతో బిగ్ బాస్ మీద అరవటం ప్రారంభించాడు. చాలామందిని చూశా.. తొక్కలో షో.. రాయలేని భాషలో కెమెరాల ముందు పచ్చి బూతులు తిట్టాడు.  ఇక ఇదే క్రమంలో బిగ్ బాస్ కూడా శివాజీకి బీపీ వచ్చిందేమో చెక్ చేయండి అని రతికకి బీపీ.. మిషన్ పంపించడంతోపాటు మిగతా ఇంటి సభ్యుల బీపీలు కూడా చెక్ చేయాలని కోరడం జరిగింది.

Advertisements

Shivaji gave an unexpected shock to Bigg Boss and scolding

దీంతో శివాజీ సీరియస్ అయి ఒప్పుకోకపోవడంతో పాటు ఏంటి మీ అందరి ముందు నన్ను బిగ్ బాస్ ఎదవని చేస్తాడా..?, నేను ఎలా కనబడుతున్నాను..?.. అంటూ రతికా దగ్గర బీపీ మిషన్.. లాగేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఇంటి సభ్యుల ముందు బిగ్ బాస్ మీద కాఫీ కోసం అరుస్తూ ఉండగా… డిస్కషన్ రూమ్ లోకి రావాలని శివాజీకి బిగ్ బాస్.. ప్రకటన చేయగా వెంటనే అక్కడికి వెళ్ళగా అక్కడ కెమెరాల ముందు సైలెంట్ అయ్యి కాఫీ తాగుతూ మల్లి బయటకు రావడం జరుగుతుంది. ఈ రకంగా ఇంటి సభ్యుల ముందు బిగ్ బాస్ మీద శివాజీ అరవటం జరిగింది. అయితే ఇదంతా చూసిన ఆడియోన్స్ యాక్టింగ్ పేరుతో బిగ్ బాస్ మీద తన కోపం అంత తీర్చుకున్నట్లు..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చినట్లు శివాజీ తిట్టిన తీరు ఉందని అంటున్నారు. గురువారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల ముందు బిగ్ బాస్ మీద శివాజీ.. సీరియస్ అయినట్లు నటించటం చాలా హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో బూతులు మాట్లాడటంతో ఖచ్చితంగా ఈ వీకెండ్ శివాజీకి నాగార్జున క్లాస్ తీసుకుంటారని ఆడియన్స్ భావిస్తున్నారు.


Share
Advertisements

Related posts

`గాడ్ ఫాద‌ర్‌` క‌లెక్ష‌న్స్‌ .. బాల‌య్య రికార్డ్‌ను చిరు ట‌చ్ చేయ‌లేక‌పోయాడుగా!

kavya N

పెళ్లిపై వార్త‌లు.. అమ్మ‌ ఆ మాటన‌గానే రామ్‌కి దిమ్మ‌తిరిగింద‌ట‌!

kavya N

చిరంజీవి ఉన్నా, ఇంకెవ‌రున్నా త‌గ్గేదేలే అంటున్న నాగార్జున‌!

kavya N