NewsOrbit
బిగ్ స్టోరీ

తెలుగు ఇండస్త్రీకి ఎప్పటికి బుద్ధి వస్తుంది..?

తెలుగు చలనచిత్ర సీనియర్ హీరోలలో చిరంజీవి ఒక సపరేట్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లాగా ఆవేశపరుడు కాదు. చాలా కూల్ గా ఫిట్టింగ్ లు పెట్టేస్తాడు. ఇప్పటికే తనపై పీకలదాకా కోపం పెంచుకుని ఉన్న తన తోటి చలనచిత్ర నటుడు అయిన బాలకృష్ణకు ఒక వింత ఫిట్టింగ్ పెట్టేందుకు ప్లాన్ వేశాడు. మధ్య వీరి మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. కరెక్టుగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెత్తనం చెలాయిస్తోంది మెగా ఫ్యామిలీనే. అందుకు తగ్గట్లుగానే చిరంజీవి కరోనా చారిటీ పెట్టాడు…. సినిమా పెద్దలతో మీటింగ్ ఏశాడు.. కెసిఆర్ ద్వారా షూటింగ్లకు పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు జగన్ ను కలిసేందుకు సన్నద్ధం అవుతున్నాడు కానీ అక్కడే ఫిట్టింగ్ పెట్టాడు.

Balakrishna: Chiranjeevi and Balakrishna all set to release movies ...

ఇక మరొకపక్క మన నందమూరి నటసింహం బాలకృష్ణ ఏమన్నా తక్కువైన వాడా? తనకు ఆహ్వానం దక్కలేదు అన్న విషయం తో పెద్ద చిన్న చూడకుండా దొరికిన వారిని దొరికినట్లు దూషించడం మరియు అందరితో పోట్లాటలు పెట్టుకోవడం…. వారిపై లేనిపోని నిందలు వేయడం. దానికి నాగబాబు పో..పో.. వోయ్ నువ్వు ఒక హీరో మాత్రమే కానీ పెద్ద తోపు ఏమి కాదు అన్నట్లు నోరు పారేసుకోవడం మొత్తం చకాచకా జరిగిపోయాయి. అయితే ఒక పెద్దమనిషి స్థానంలో ఉన్న చిరంజీవి గొడవ సద్దుమణిగేలా చూడలేదు. నేరుగా 9 తేదీన జగన్ తో అపాయింట్మెంట్ కుదుర్చుకున్నాడు. ఈమధ్య జగన్ తో చిరంజీవికి సాన్నిహిత్యం బాగా ఎక్కువ అయ్యింది కూడా. అమరావతి తరలింపును చిరు స్వాగతించాడు.. జగన్ ఎప్పుడు కలవమంటే అప్పుడు వెళ్లి కలుస్తూ ఉన్నాడు.

ఇక ఇప్పుడైనా ఇద్దరు కలిసి వెళ్లి తమ మధ్య గొడవలు ఏమీ లేవు అన్నట్లు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అవుతారని ఫ్యాన్స్ అంతా అనుకుంటుండగానే…. బాలకృష్ణ తాను మీటింగ్ కి వచ్చేది లేదని తేల్చి చెప్పేశాడు. దానికి కారణంగా పక్కరోజు జరగనున్న తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉంటున్నాను అని చెప్పేశాడు. కనీసం అప్పుడైనా చిరంజీవి…. బాలకృష్ణను వ్యక్తిగతంగా అడిగి ఉంటే బాలయ్య కాదనేవాడా? అసలు చిరంజీవి కి అటువంటి ఉద్దేశం ఉందా లేదా? చిరంజీవి వేరొకరితో బాలయ్యను ఇప్పుడు ఆహ్వానింపజేస్తే…. బాలకృష్ణ రాకపోవడానికి అసలైన కారణం ఏమై ఉంటుంది..?

ఇలా ఎన్నో ప్రశ్నల నడుమ సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి అర్థం అయ్యేది ఏమిటంటే…. వీరు స్టేజీపైన కలిసినప్పుడు ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని భుజాలు కరుచుకుని నటిస్తారు తప్ప నిజ జీవితంలో మాత్రం ఎప్పటికీ బద్ధశత్రువులలాగానే మిగిలిపోతారని. నిజంగా ఇద్దరు మనుషులకి తాము కలవాలి.. తమ మధ్య విభేదాలు ఉండకూడదు అని అనుకుంటే ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా చేర్చుకుంటారా? పైగా లాక్ సమయంలో వ్యక్తిగత పనులు కూడా ఏమీ లేవాయె. ఏదేమైనా పరిపక్వత లేని స్టార్ డమ్ లు పదవులు అస్సలు ఎందుకొరకు?

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju