NewsOrbit
బిగ్ స్టోరీ

జగన్ ఇక జన్మలో సి‌ఎం కుర్చీ దిగకుండా చేస్తున్న బాలయ్య?

ఎన్నడూ లేని విధంగా కొద్దిరోజులుగా నందమూరి నట వారసుడు బాలకృష్ణ వార్తల్లో చాలా ఎక్కువగా కనబడడం చూస్తూ ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ చాలా పేరొందిన పర్సనాలిటీ అయినా ఎప్పుడో అడపాదడపా అభిమానులను కొట్టినప్పుడో…. స్టేజీపైన విచక్షణ లేకుండా మాట్లాడినప్పుడో అతని పేరు తెరమీదకు వచ్చేది…. మళ్ళీ కొద్ది రోజులకి కనుమరుగయ్యేది. కానీ గత వారం నుండి బాలకృష్ణ పేరు సోషల్ మీడియా తో పాటు ఇటు డిజిటల్ మీడియా లో మార్మోగిపోతోంది. సరే బాలయ్య ఇంత యాక్టివ్ గా ఉండడం వల్ల అతని ఇమేజ్ కు లేదా అతని పార్టీకి ఏదైనా లాభం చేకూరుతుంది అంటే…. లేదనే చెప్పాలి.

Balakrishna's Ingratitude on YS Jagan?

అసలు తతంగం అంతా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు ఇంట్లో నిర్వహించిన సినీ పెద్దల సమావేశానికి బాలయ్యని పిలవకపోవడం తో మొదలైంది. దీనికి తీవ్రమైన ఆగ్రహం చెందిన బాలయ్య చాలా దూకుడుగా విషయంపై స్పందించి భూములు పంచుకోవడానికి అంతా కలిసి సమావేశం అయ్యారు అని ఆరోపణలు చేశాడు. తర్వాత మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య కు విపరీతమైన కౌంటర్ ఇచ్చి అతని మాటను వెనక్కి తీసుకోవాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రెండు రోజులకి పరిస్థితి సద్దుమణిగిన తరువాత బాలయ్య కు సీఎం జగన్ ను సినీ ప్రముఖులు కలుస్తున్నప్పుడు ఆహ్వానం లభించగా తన పుట్టినరోజు వేడుకలు కారణంగా తాను రాలేనని చెప్పడం గమనార్హం.

సరే ఇక్కడితో వివాదం అంతా పూర్తయింది ఇండస్ట్రీ అంతా ఒకటే అని సగటు సినిమా ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో బాలయ్య తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చిరంజీవి ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించాయి. తరచుగా 80 తారలు అందరూ రీయూనియన్ పార్టీ జరుపుకుంటారు అని…. గతంలో తనను చాలాసార్లు పిలిచారు అని మరి హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు మాత్రం తనకు ఆహ్వానం లభించలేదని బాలయ్య మండిపడ్డాడు.” అయినా డోంట్ కేర్..! నాకు నచ్చిన దారిలో నేను వెళ్తానన్ను అలా ట్రీట్ చేసిన వారిని పూర్తిగా అవాయిడ్ చేస్తా అంటూ బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు.

నాది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అని…. చేస్తే పూర్తిగా నన్ను అవాయిడ్ చేయండి….” అని బాలయ్య అన్న మాటలు అతని స్థాయికి తగినట్లుగా లేవని ఆంధ్ర ప్రజానీకం అభిప్రాయం. అలాగే మాటలు అన్నీ అసలు ఎవరిని బెదిరించడానికిఇతరులని రెచ్చగొట్టేలా మాట్లాడే అంత సంకుచిత స్వభావం ఎందుకు వచ్చింది అన్నది అందరి ప్రశ్న. అంతేకాకుండా అహం, గర్వం తమకు ఆభరణాలని…. తమ స్థాయి వేరు అని తాము లైఫ్ దాన్  లైఫ్ సినిమాలు చేశామని బాలయ్య బీరాలు పలకడం తో అటు సినీ ప్రేక్షకులే కాకుండా సాధారణ జనాలు కూడా ముక్కున వేలు వేసుకోవలసి వచ్చింది.

అయితే ఇప్పుడు బాలయ్య కనబరుస్తున్న ప్రవర్తన మరియు దాని ప్రభావం తెలుగుదేశం పార్టీపై భారీగా పడింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవిని తిట్టడం వల్ల మెగాస్టార్ కు ఎటువంటి నష్టం కాకపోగా అటు టిడిపి పై ప్రజలకు ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. ఇప్పటికే వ్యాఖ్యలపై తెదేపా పై బాగా వ్యతిరేకత పెరిగిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతుండగా దానివల్ల వైసిపికి లాభం బారీగా కలిగినట్టు అని వారు అభిప్రాయపడుతున్నారు. బాల‌య్య చేష్ట‌లు, ఎల్లో మీడియా పైత్యం వ‌ల్ల అంతిమంగా వైసీపీకి మెగా అభిమానుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఒక‌వేళ వైసీపీకి కూడా ద‌గ్గ‌ర కాలేద‌నుకున్నాటీడీపీకి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారు సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌ర‌నేది సుస్ప‌ష్టం. ప‌రోక్షంగా విధంగానైనా వైసీపీకి లాభ‌మే. అందువ‌ల్ల బాల‌కృష్ణ త‌న మాట‌ల‌తో వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju