NewsOrbit
బిగ్ స్టోరీ

వామ్మో: జగదేక వీరుడు అతిలోక సుందరి… సినిమా కాపీనా ? 

 

అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా’ వచ్చి 30 ఏళ్లు అయిందట. అయితే దాని నిర్మాత తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ తీస్తానని కరాఖండిగా చెప్పేశారు కూడా. కొద్ది రోజులు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి జంటగా ఈ సినిమా తీస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆ నిర్మాత తన ప్రతిజ్ఞను పునరుద్ధరించాడు.

ఇకపోతే ఆ సినిమా యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆల్ టైమ్ క్లాసిక్ అని ఆ సినిమాకి చాలా పెద్ద ముద్ర వేయడమే కాకుండా చిరంజీవి అప్పట్లో 106 డిగ్రీల జ్వరంతో డ్యాన్సులు చేశారు అని కూడా రాస్తున్నారు. ఈ సినిమా బంపర్ హిట్.. అందులో తిరుగు లేదు. కానీ దానికి కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసినప్పుడే సినిమా ప్రేమికుల మనసులు ఒప్పుకోవడం లేదట. అన్నీ కమర్షియల్ హంగులతో రంగరించిన ఒక సక్సెస్ ఫార్ములాతో ఫ్యాంటసీ సినిమాని తెరకెక్కించే లక్షలాది రూపాయలు ఈ చిత్రం వసూలు చేయగా పెద్ద పెద్ద సినిమా పండితులే ఆశ్చర్యపోయారు.

అయితే ఆ సినిమాపై ఇప్పటికే అనేక మందికి కొన్ని తీరని అనుమానాలు ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన రెండు రోజులకు ఈనాడు తన ఎడిట్ పేజీలో సినిమాను వెక్కిరిస్తూ వ్యంగ్యంగా ‘మతిలేని వీరుడు గతి లేని సుందరి’ పేరిట ఒక ఆర్టికల్ కూడా వేసింది. ఆ చర్చ వచ్చినప్పుడు ఒక అతను చెప్పిన మాట ఏమిటంటే… సినిమా దర్శకుడు రేలంగి నరసింహారావు ఆ కథను ఒక నిర్మాతతో చెప్పారట. రాజేంద్రప్రసాద్ తో ఆ సినిమాను కూడా ప్రారంభించారు. చివరికి అదే కథను రాఘవేంద్రరావు చిరంజీవితో తీస్తున్నట్లు తెలుసుకుని ఆయనను కలుసుకుని మొరపెట్టుకున్నారు.

అయితే తమ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది…. కాబట్టి రేలంగిని త్వరగా తన సినిమాను పూర్తిచేసి విడుదల చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రెండు సినిమాలు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మార్కెట్లను బట్టి ఆడాయి. ఒకరి దగ్గర కథ విని మరొకరికి చెప్పుకునే కథాచోరులు మన సినీ ఇండస్ట్రీలో మామూలే. అయితే చాలా మందికి ఇది కేవలం ఒక వార్త

ఇక రాజేంద్రప్రసాద్ సినిమా కి వస్తే ఆ సినిమా పేరు రంభ-రాంబాబు. అందులో రాజేంద్రప్రసాద్ సరసన పారిజాత అనే ఒక అనామక హీరోయిన్ నటించింది. అందులో చంద్రమోహన్ నారద పాత్రధారి కాగా దాసరి నారాయణరావు యమధర్మరాజు. అందులో కథానాయకి పాత్ర దేవనర్తకి రంభ. నిజానికి ఈ సినిమాకి మరియు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి మానవుడు-దేవకన్య తప్ప వేరే పోలికలు లేవు. కథ మొత్తం వేరే…. ట్రీట్మెంట్ కూడా వేరే. అయితే రేలంగి ముందు వేరే కథ అనుకొని రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు దెబ్బకు కథలో మార్పులు చేశారా అన్న అనుమానం ఇప్పటికీ చాలామందిలో ఉండిపోయింది.

అయితే కమర్షియల్ సినిమాకు సంబంధించి రాఘవేంద్రరావు స్టైల్ మనకి తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ అందరి చెవుల్లో మోగుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా కాపీయా కాదా…. అన్నది రెండు సినిమాల దర్శక-నిర్మాతలు నలుగురికే తెలియాలి. ఇక ఎన్నో మధ్య బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని క్లాసిక్ కన్నా కూడా ఒక కమర్షియల్ పెద్ద సక్సెస్ అయిన సినిమా గా చెప్పడం మంచిది. అచ్చం మొన్న వచ్చిన మన బాహుబలి లాగా.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment