NewsOrbit
Featured బిగ్ స్టోరీ

అసమ్మతి లేదు… కాకరగాయ లేదు… !! ఫేస్‎బుక్ గుట్టురట్టయ్యిందనే బీజేపీ కుట్రలు!!

ఫేస్ బుక్ బీజేపీ లొల్లిలో కాంగ్రెస్

యంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు మొత్తం సీన్ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతోంది.  కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను  డామేజ్ చేయాలన్న ఆలోచన బీజేపీ చేస్తోందా?  రాహుల్ గాంధీ… బీజేపీ ఫేస్ బుక్ కుమ్మక్కు గురించి మీడియాలో దూకుడు పెంచితే… కథ రివర్స్ గేర్ లో కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటోంది.  బీజేపీ నేతలు రెచ్చిపోయి… ఫేస్ బుక్ లో విధ్వంసకర స్టేట్మెంటిస్తుంటే… ఆ కంపెనీ ఏం చేస్తోందంటూ… కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంటే… అదే సమయంలో హస్తం పార్టీ నాయకత్వం గురించి సంజయ్ ఝా ప్రశ్నించడం… అందులో కూడా సోనియా గాంధీకి… కాంగ్రెస్ పార్టీ నేతలు లేఖ రాశారంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రెకెత్తిస్తోంది.

no-dissengtment-in-party-bjp-foulplay-over-facebook-conspiracy
congress leaders file photo

సోనియా గాంధీకి వంద మంది లేఖా?

నాయకత్వ మార్పు కోరుతూ సోనియా గాంధీకి వంద మంది లేఖ రాశారంటూ బహిష్కృత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా లేఖ కాకరేపుతోంది. ఐతే సంజయ్ ఝా చెబుతున్నట్టు లేఖ ఏమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ చప్పుడు చేస్తోంది. కొందరు కావాలని పనిగట్టుకొని ఇలాంటి లేఖలు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్ దీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. లేని లేఖలు ఉన్నాయంటూ… ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఫేస్‎బుక్‎కి సంబంధించి రాసిన లేఖను పక్కదోవ పట్టించే కుట్ర చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. సచిన్ పైలట్ వ్యవహారంలో పార్టీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు గాను సంజయ్ ఝాను అధికార ప్రతినిధిగా తొలిగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. No dissengtment in Party !!BJP foulplay over Facebook conspiracy !!

cwc meeting file photo

లేఖ పేరుతో కాంగ్రెస్‎పై కుట్రలు

ఇవాళ ఉదయం బహిష్కృత నేత సంజయ్ ఝా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సుమారుగా వంద మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు… వారిలో ఎంపీలు సైతం… మొత్తం గందరగోళ పరిస్థితులపై సోనియా గాంధీకి లేఖ రాశారని… CWC ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారని… నాయకత్వ మార్పుపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. అయితే ఝా చేసిన ట్వీట్ పూర్తిగా నిరాధారమైనదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులుగానీ, ఎంపీలుగానీ అలాంటి లేఖ ఏదీ రాయలేదని… ఝా చేస్తున్న ప్రచారం కేవలం కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే కుట్రలో భాగమంటూ పార్టీ అధికార ప్రతినిధి, రాహుల్ గాంధీ ముఖ్య అనుచరుడు రణదీప్ సింగ్ సుర్జేవాల పేర్కొన్నారు.

 No dissengtment in Party !!BJP foulplay over Facebook conspiracy !!
wall street journal copy

ఫేస్‎బుక్-బీజేపీ కుమ్మక్కు బయకు రాకుండా…

ఫేస్‎బుక్‎తో బీజేపీ కుమ్మక్కు గురించి జరుగుతున్న అంశంలోని వాస్తవాలు బయటకు రాకుండా చేసేందుకు మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చే ఒక ఒక సెక్షన్… టీవీ డిబేట్ గైడెన్స్‎లో కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తోందంటూ సుర్జేవాల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసే నీతిబాహ్య చర్యలను వెలుగులోకి తెచ్చే సమయంలో కావాలని తెరపైకి ఈ అంశాన్ని తెచ్చారన్నారు. బీజేపీ-ఫేస్ బుక్ లింక్స్ బయటకు రాకూడదనే ఈ కుట్ర పన్నారని… బీజేపీకి మేలు చేసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఫేస్‎బుక్ సాక్షిగా బీజేపీ నేతలు నిత్యం చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, సమాజాన్ని చీల్చేలా చేస్తున్న విపరీత వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉండటానికి కారణం… బీజేపీ, ఫేస్‎బుక్ మధ్య లోపాయికారీ ఒప్పందమేనంటూ సుర్జేవాల విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు, రెచ్చగొట్టే అంశాలను ఫేస్‎బుక్ పట్టించుకోవడం లేదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం సంచలనం రేపుతోంది.

 No dissengtment in Party !!BJP foulplay over Facebook conspiracy !!
Sanjay Jha

నాయకత్వ మార్పుపై క్లారిటీ కోరుతున్న నేతలు

సంజయ్ ట్వీట్‎లో చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరగడం లేదని… కానీ సీనియర్ నేతలు కొందరు మాజీ మంత్రులు, ఎంపీలు పార్టీలోని అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు సోనియాగాంధీ అపాయిట్మెంట్ కోరారని మాత్రం రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు. నాయకత్వానికి సంబంధించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వాలని… ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో చెప్పాలన్న వర్షన్ కొందరు నేతలు కోరుతున్నారు. రాజస్థాన్ లో తలెత్తిన సమస్యలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగా పరిష్కరించారో వివరించడంతోపాటు, నాయకత్వానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించాలని వారు కోరారు.

 No dissengtment in Party !!BJP foulplay over Facebook conspiracy !!
sachin pilot, ashok gehlot

రాజస్థాన్ మరో మధ్యప్రదేశ్ కాబోతుందా?

అదే సమయంలో రాజస్థాన్ ప్రతిష్టంభన విషయంలోనూ పార్టీ నేతలు క్లారిటీ కోరుతున్నట్టు తెలుస్తోంది. సచిన్ పైలట్ ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల్లో సానుకూలత వ్యక్తం చేసినా… అది తాత్కాలికమేనని.. భవిష్యత్ లో అది మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయంలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. పైలట్ వ్యవహారం పార్టీలో ఎన్నో కొత్త ప్రశ్నలు రేకెత్తించిందని… కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కోల్పోడానికి కారణమైన జ్యోతిరాధిత్య సింధియా వ్యవహారంతో చూడాల్సిన అవసరం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్ మరో మధ్యప్రదేశ్ కాకుండా ఉండాలంటే అందుకు పటిష్టమైన చర్చలు అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు.

 No dissengtment in Party !!BJP foulplay over Facebook conspiracy !!
sonia gandhi file photo

అప్పటి వరకు సోనియానే పార్టీ చీఫ్

135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అంతర్గత ఎన్నికల వ్యవహారం చిన్న అంశమైనప్పటికీ… పార్టీలో అంతర్గత ఎన్నికలు జరపాలని చాలా మంది సీనియర్ నేతలు కోరుతున్నారు. సోనియా గాంధీ ఏడాది తాత్కాలిక అధ్యక్షురాలి పదవి ఆగస్టు 10తో పూర్తయినందున… పార్టీలో ఎన్నికల అంశాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీలో పూర్తి స్థాయి నిర్ణయం వచ్చే వరకు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తొందరగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడ్ని తీసుకురావాలని ఇటీవల ఎంపీ శశిధరూర్ కూడా హైకమాండ్ కు సూచించారు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju