NewsOrbit
Featured బిగ్ స్టోరీ

నాలుగు పార్టీల నూతన్ నాయుడు..!! డబ్బు + రాజకీయం తెచ్చిన పైత్యం..!!

ఇంట్లో సీసీ కెమెరాలు ఏంటి..? ఇంట్లో అంత మంది సిబ్బంది ఏంటి..? ఒక ఫోన్ పోయిందని పని వాడిని ఇంటికి పిలిపించి కొట్టడం ఏంటి..?? శిరోముండనం చేయించి పంపించడం ఏంటి..?? అసలు ఎవరీ నూతన్ నాయుడు..?
ఓ సారి టీడీపీ అనుకూల సర్వే టీంలో కనిపిస్తాడు..! మరోసారి పవన్ అభిమాని అని, జనసేనకు పని చేస్తానంటాడు..! ఇంకోసారి వైసీపీకి అనుకూలంగా పని చేసి రాజకీయ అజెండాలు రూపొందించాం అని చెప్తుంటాడు..!! 2014 ఎన్నికల్లో “జై సమైఖ్యఆంధ్ర” తరపున పోటీ చేశా అంటాడు..! అసలు ఎవరీ నూతన్ నాయుడు..??
ఎవరికైనా “ఓవర్ నైట్ స్టార్” ఒక్క రాత్రి చాలు.., కానీ ఈ నూతన్ నాయుడు అనేవాడికి రెండు రాత్రుళ్ళు వచ్చాయన్నమాట. అందుకే అప్పుడెప్పుడో బిగ్ బాస్ సందర్భంగా ఈయన పేరు గూగిలితే.., మళ్ళీ ఇన్నాళ్లకు గూగుల్ కి నూతన్ నాయుడుని వెతికే పని పడింది.

డబ్బు పైత్యం… బాగా కమ్ముకున్నట్టుంది..!!

నూతన్ నాయుడు వ్యక్తిత్వం అనేది పక్కన పెడితే.., ఈ శిరోముండనం కేసులో ఆయన పాత్ర ఉందా, లేదా అనేది పక్కన పెడితే… ఆయనలో డబ్బు పైత్యం మాత్రం బాగా కనిపిస్తుంది. లేకపోతే “ఇంట్లో సీసీ కెమెరాలు ఏంటి..? ఆరుగురు పని వాళ్ళు ఏంటి..? మెంటార్ పేరిట ఒక సంస్థ ఏంటి ..? మొత్తం పాతిక మంది ఎక్కువగా అమ్మాయిలు పని చేయడం ఏంటి..? సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ అవసరమైతే తన రూమ్ కి రావడం ఏంటి..? ఇలా చాలా కోణాల్లో అతనికి డబ్బు పైత్యం కమ్ముకుంది అనేది స్పష్టమవుతుంది. ఆ పైత్యమే ఆయన కుటుంబాన్ని, భార్యని చివరికి పోలీసులకు, మీడియాకు అడ్డంగా బుక్ చేసేలా చేసింది. పోలీసుల పని సులువు చేసింది. ఇంట్లో సీసీ కెమెరాల రికార్డింగుల ద్వారానే “ఆయన ఇంట్లో శిరోముండనం” కేసుని త్వరగా ఛేదించగలిగాం అంటూ పోలీసులే చెప్పారు. తద్వారా ఆయన భార్యని తప్పించాలన్నా అవ్వలేదు. భార్య కూడా చేతిలో కర్ర పట్టుకుని అడ్డంగా కనిపించడంతో చేసేదేమి లేక ఆమె పాత్ర పోలీసులకు తేలికయింది. ఇదే లేకపోతే ఏదోటి చేసి తన భార్యని తప్పించేసే వాడే. తీరా రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది తర్వాత భార్యకి బాలేదని, బెయిల్ ఇచ్చేయాలని కోరుతున్నారట. అసలే అట్రాసిటీ కేసు, ఆధారాలున్నాయి, రాష్ట్రంలో సంచలన కేసుగానూ మారింది. కాబట్టి నూతన్ నాయుడు కొన్నాళ్ళు ఆగాల్సిందే..!

ఇంతకూ నూతన్ ఏ పార్టీ..??

నూతన్ నాయుడు రాజకీయ నాయకుడు కాదు. ప్రజా నాయకుడు అసలు కాదు. కేవలం డబ్బుంది. బిగ్ బాస్ పుణ్యామాని కొంచెం ఫేమ్ ఉంది. ఇప్పుడు శిరోముండనం ఘటనతో ఇంకాస్త ఫేమ్ వచ్చేసింది. మధ్యలో అనేక సార్లు మీడియా కంట పడినా పెద్దగా పట్టించుకునే వారు లేరు. నూతన్ నాయుడు ఏ పార్టీ అంటే చెప్పడం కష్టమే.
* 2019 ఎన్నికల్లో లగడపాటి టీడీపీ తరపున పనిచేసారు (సర్వే చేసారు) ఆ సర్వే ద్వారా నూతన్ నాయుడు కూడా లగడపాటితో కలిసి పని చేసారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీడీపీకి పని చేశారు.
* 2014 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి “జై సమైఖ్యఆంధ్ర” పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.


* 2014 కి ముందు రెండేళ్ల పాటూ వైసిపిలో తెరవెనుక పని చేశారు. పార్టీ అజెండా, సిద్ధాంతాల రూపొందించే టీమ్ లో పని చేశారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు.
* తాజాగా జనసేన అభిమానిగా మారిపోయారు.. పవన్ కళ్యాణ్ పై వర్మ టార్గెట్ చేసి సినిమా తీస్తే.., ఈయనే దానికి విరుగుడుగా “పరాన్నజీవి” అనే సినిమా  తీసేసి వదిలారు. మొత్తానికి రాజకీయుడు, రచయిత, నటుడు, నిర్మాత, డైరెక్టర్ అన్నీ అయిపోదాం అనుకుని… కావాల్సినంత డబ్బున్నా ఏమి కాలేని సాధారణ నూతన్ నాయుడు చివరికి ఇలా సెలెబ్రిటీ అయిపోయారు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju