NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

‘డూ ఆర్ డై’ గేమ్ లో పవన్ ఛాన్స్ తీసుకుంటున్నాడా…?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కి పవన్ అడుగు పెట్టినప్పుడు అది ఒక సంచలనం. అయితే సరిగ్గా అప్పటి నుండి 5 ఏళ్ల తర్వాత అతని రాజకీయ ప్రస్థానమే అగమ్యగోచరం అయిపోయింది. ఇటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో అతను ఛాన్సులు తీసుకోవడం ఎంతవరకు కరెక్టో చూద్దాం…

 

ఇదే ట్రంప్ కార్డ్..!

మొదట టిడిపి తో చేతులు కలిపిన పవన్… నిదానంగా తానే సపరేట్ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విడిపోయారు. వారి మధ్య వచ్చిన విభేదాలు పక్కన పెడితే అది పవన్ కళ్యాణ్ ఘోరంగా దెబ్బ తీసింది చెప్పాలి మరి 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీట్లు గెలుచుకొని తర్వాత దానిని కూడా నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్న పార్టీ 2024లో అధికారం చేజిక్కించుకుంటుంది అంటే ఎవరూ నమ్మరు. మరి ఇక్కడ మాత్రం 2019 లో జరిగిన సీన్ పునరావృతమైతే పవన్ రాజకీయ ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడిపోవచ్చు.

సమయం లేదు మిత్రమా…

ఇలాంటి ఈ సమయంలో పవన్ వరుస సినిమాలు సంతకం చేశారు. అతని ప్రత్యర్థులు అయితే సినిమాల్లో కి వెళ్లనని పవన్ మాట తప్పాడు అని ఎంతో విమర్శించారు. అయితే పార్టీ ఆర్థిక పుష్టి కోసమే తాను మళ్లీ సినిమాల చేస్తున్నట్లు రాజకీయాలలో యాక్టివ్ గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మరి కళ్యాణ్ ప్లాన్ ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కాలేదు. మొత్తానికి అయితే 2021లో అతనివి రెండు సినిమాలు పెట్టుకొని విడుదలయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక ఆ తర్వాతి సంవత్సరానికి రెండు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరం గడువు మాత్రమే ఉంటుంది అన్నది పవన్ గుర్తుంచుకోవాల్సిన విషయం.

 

జగన్ దారి అచ్చొచ్చేనా…?

ప్రస్తుతం పార్టీ వర్గాల్లో టాక్ ఏంటి అంటే నాదెండ్ల మనోహర్ వంటి నేతలను కీలక బాధ్యతలు అప్పగించి పవన్ సినిమాలు చేస్తారని అయితే ఎన్నికల సమయంలో మాత్రం పాదయాత్ర స్థాయిలో ఒక కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చి జనసేన ను తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని భావిస్తున్నాడట. ఇక ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ… సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు అటువంటిది జరిగితే పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని వాదనలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడానికి క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడమే కారణం అని పవన్ భావిస్తున్నారు. అందుకే మొత్తం ఇలా ప్లాన్ డిజైన్ చేసుకున్నట్లు చెబుతున్నారు.

 

ఎండ్ గేమ్…?

ఇప్పటికే దాదాపు ఒక సంవత్సరం కోవిడ్ కారణంగా వృధా అయింది. అసెంబ్లీలో అతని పార్టీ తరఫున మాట్లాడే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇతను చూస్తే మరొక రెండేళ్లు సినిమాలకు డేట్లు ఇచ్చేశారు. పూర్తిగా ఇవ్వకపోయినా దాని ఎఫెక్ట్ మాత్రం కచ్చితంగా పడుతుంది. ఇలాంటి సమయంలో చివరి నిమిషంలో పాదయాత్ర ఇలాంటివి చేయడం అంటే ఛాన్స్ తీసుకోవడమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ వేసుకున్న షెడ్యూల్ ఉన్నట్లుండి మార్చడం జరిగే పని అయితే కాదు. మరి ఈ డూ ఆర్ డై గేమ్ లో పవన్ వేసుకున్న ప్రణాళిక, తీసుకున్న నిర్ణయాలు అతనికి సానుకూల ఫలితాలను తెచ్చిపెడతాయా లేదా అన్నదే ప్రశ్న.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?