NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ ఎమ్మెల్యే కు మాట్లాడటం చేతకాదా ? ప్రతిసారి వివాదమే

 

 

ఆయనో ఎమ్మెల్యే . మాట్లాడితే పక్కన ఉన్నవాడికి సైతం అర్ధం కాదు. ఎం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, అసలేం చెబుతున్నారో, తాగి ఉన్నారో అని కూడా సందేహం వచ్చేలా అయన మాట తీరు ఉంటుంది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినపుడు ఒకసారి జాతీయ స్థాయిలో పరువు పోగుట్టుకున్న ఆయన తాజాగా మరోసారి తన మాట తీరుతో వార్తల్లో నిలిచారు ఆయనే చిత్తూర్ జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు.

జగనన్న గాలిలో అలా

ఎం.ఎస్ బాబు 5 వ తరగతి చదువుకున్నారు. బాగా ఆస్తిపరులు. తాతలు తండ్రుల సంపాదన ఉంది. చదువు అబ్బలేదు కానీ వ్యాపారం లో ఇరగ దీశారు. సంపాదనను పెంచేవారు. బెంగళూర్ ముఖ్య కేంద్రం గాఎన్నో వ్యాపారాలు చేశారు. ముఖ్యంగా రియాల్ ఎస్టేట్ బూమ్ ఉన్నపుడు వద్దు అంటే కోట్లు వచ్చి పడ్డాయి. బెంగళూరు అభివృద్ధి అవుతుంటేనే వారి ఆదాయం పెరిగింది. అనుచరగణం, బంధువులు, యువత వచ్చారు. సొంత ఊరు వెంకటాపురం. చిత్తూర్ రూరల్ లో ఉంటుంది. రాజకీయంగా సైతం ఎదగాలని కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ గా పోటీ చేశారు. ఓటమిపాలయ్యారు . ఇంత సంపాదన ఉన్నా గెలవకపోవడంతో మళ్ళీ పార్టీ వైపు చూడలేదు. మళ్ళీ వ్యాపారాలు. సంపాదన మీద ద్రుష్టి పెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ను కాదని ఈయనకు వైస్సార్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చింది. సర్పంచ్ గా కూడా గెలవలేని అయన ఏకంగా ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నారు.

మాట్లాడితే ఒట్టు!!

ఎమ్మెల్యే గా ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు. ఎన్నికల ప్రచారంలో సైతం ఎప్పుడు నోరు విప్పింది లేదు. నామినేషన్స్ చివర్లో టికెట్ తెచ్చుకున్న అయన ప్రచారంలో సైతం ఏమి మాట్లాడకుండానే దణ్ణం పెట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. వోట్ వెయ్యండి అనే మాట వచ్చేది కాదు. ప్రచారానికి వచ్చే కార్యకర్తలే ఎం మాట్లాడాలన్నా, ఎం చెప్పాలన్న అన్నట్లు సాగేది. ఇక పెద్ద నాయకులూ వస్తే వారి పక్కన నిలబడి ఉండటం తప్పితే, బహిరంగ సభల్లో మాట్లాడింది లేదు. జగన్ గాలిలో ఎమ్మెల్యే అయిపోయిన ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం రోజునే ఎం ప్రమాణం చేస్తున్నాడో అర్ధం కానీ భాషను వినియోగించి జాతీయ స్థాయిలో ఆబాసు పాలయ్యారు. తాజాగా దేశ సరిహద్దులో వీర మరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం కి గురువారం ప్రవీణ్ మృతదేహం చేరుకున్నప్పుడు ఈయన ఎం మాటలు మరోసారి వార్తలు కెక్కాయి . ఎం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎం చెబుతున్నారో అర్ధం కాకా అక్కడికి వచ్చిన వారితో పాటు మీడియా మిత్రులు జుట్టు పీక్కున్నారు.

సిట్టింగ్ ను పక్కన పెట్టి మరి

పూతలపట్టు ఎమ్మెల్యే గా 2014 లో డాక్టర్ సునీల్ గెలిచారు. పేదల డాక్టర్గా పేరున్న ఆయన విద్యావంతుడు. అయితే నిత్యం బెంగుళూర్ లో ఉంటారని పేరున్న ఆయనను తప్పించి వైస్సార్సీపీ సిట్టింగ్ స్థానాన్ని ఎం.ఎస్.బాబుకు ఇచ్చారు. ఈయనకు ఈ నియోజకవర్గంలో వోట్ సైతం లేదు. నియోజకవర్గంలో వైస్సార్సీపీ నాయకులూ, డబ్బు బాగా ఖర్చు పెట్టె నాయకులూ కనిపించలేదు. అందులో ఎస్సి నియోజకవర్గం కావడంతో పాటు కేడర్ ను ఒక దారిలో పెట్టె వారు లేరు. దింతో చిత్తూర్ జిల్లా పెద్ద మనిషిగా ఉన్న పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి బాబును పిలిపించి వెనువెంటనే టికెట్ ఖరారు చేపించారు. అలా సునీల్ స్థానంలోకి వచ్చిన బాబు ఇప్పుడు ఎం మాట్లాడుతారో టికెట్ ఇప్పించిన పెద్దిరెడ్డికి అంతుపట్టని చందం తయారు అయ్యింది.

author avatar
Special Bureau

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju