NewsOrbit
Featured బిగ్ స్టోరీ

TDP Video: అచ్చెన్న వీడియో కొంత నిజం – కొంత అబద్ధం..! టీడీపీలో టార్గెట్ లోకేష్..!?

Telugu Desam Party: Virus Killing Party future..!?

TDP Video: అచ్చెన్నాయుడు – కరుడుగట్టిన టీడీపీ వాది..! అన్నయ్య ఎర్రన్నాయుడు నుండి టీడీపీలో చాటుగా ఎదిగిన అచ్చెన్న.. అన్న మరణం తర్వాత టీడీపీలో నేరుగా ఎదిగారు. మొదట్లో జిల్లాలో.. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అచ్చెన్న కీలక నేతగా మారారు.. అటువంటి అచ్చెన్నాయుడు “లోకేష్ వ్యవహారాన్ని 17 తర్వాత తేల్చేస్తా.. పార్టీ లేదు బొక్క లేదు” అనడం సంచలనంగా మారింది. టీడీపీలో ఏదో జరుగుతుంది అన్నట్టు కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసింది. చివరికి టీడీపీ దిద్దుబాటు చర్యలకు దిగి ఒరిజినల్ వీడియోలను విడుదల చేసింది. అందులో కూడా లోకేష్ పట్ల, పార్టీ పట్ల అచ్చెన్న అసంతృప్తి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ వీడియోల సంగతి పక్కన పెట్టి టీడీపీలో లోకేష్ తీరునే ఓ సారి లోతుగా చర్చించుకుందాం..! ఇవి కరుడుగట్టిన టీడీపీ వాదులూ అంతర్గతాలను గ్రహించాల్సిన అంశాలే..!!

TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1
TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1

TDP Video: 2019 లో పార్టీని కొంత నాకించింది నారా లోకేష్..!?

లోకేష్ లో నాయకత్వ లక్షణాలు.. పార్టీలో అతని వ్యవహారశైలి.. పార్టీ నేతలతో అతని సంభాషణలు.. అతని వ్యక్తిత్వాలను మాట్లాడుకునే ముందు 2019 ఎన్నికల్లో అతని తీరుని ఓ సారి చెప్పుకోవాల్సిందే..!
2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ పోల్ మేనేజ్మెంట్ వేరు.. 2019 ఎన్నికల్లో వేరేగా జరిగింది. 1994 నుండి 2014 ఎన్నికల వరకు టీడీపీ పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు పూర్తిగా చంద్రబాబు చేతిలోనే ఉండేవి. ప్రచారం, ఆర్ధిక వ్యవహారాలు అన్ని ఆయనే చూసుకునే వారు. ఆయనకు తోడుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహనరావు.. వంటి వారు ఉండేవారు. జిల్లాల వారీగా వీరికి బాధ్యతలు అప్పగించి ఓవరాల్ గా చంద్రబాబు పర్యవేక్షణ, డైరెక్షన్ ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోల్ మేనేజ్మెంట్, ఆర్ధిక బాధ్యతలను లోకేష్ కి అప్పగించారు. చంద్రబాబు మొత్తం ప్రచార బాధ్యతలు నెత్తిమీద వేసుకున్నారు.

TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1
TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1

* ఎన్నికలు అంటే ఆర్ధిక వనరులు ముందే చూసుకోవాలి.. పోలింగ్ కి వారం ముందే నియోజకవర్గాలకు చేర్చాలి. పక్క ప్రణాళికతో ఉండాలి. దీనిలో లోకేష్ మిస్ అయ్యారు. ఈయన అనుభవం లేమితో ప్రత్యర్థులకు దొరికిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆర్ధిక మూలాల్ని అటు బీజేపీ, ఇటు టీఆరెస్ సహా వైసీపీ కూడా పెద్దగా టార్గెట్ చేయడంతో పార్టీకి అందాల్సినవి అందలేదు. ఇది టీడీపీ ఏ మాత్రం ఊహించలేదు. అందుకే పోలింగ్ కి రెండురోజుల ముందు వరకు పార్టీ నుండి వస్తాయి.. వస్తాయి అని వేచి చూసిన అభ్యర్థులు అవి రాకపోయే సరికి కొందరు చేతులెత్తేశారు. కొందరు స్థానికంగా సర్దుబాటు చేసుకుని పంచారు. కొందరు ఆస్తులు అప్పటికప్పుడు తాకట్టు పెట్టుకున్నారు..!
* ఇక్కడే లోకేష్ కి సుజనా చౌదరి/ సీఎం రమేష్ వంటి నేతలకు బాగా చెడింది. టీడీపీలో ఆర్ధిక మూలాల్ని బాగా హ్యాండిల్ చేసిన సుజనా, సీఎం రమేష్ వంటి నాయకులతో లోకేష్ కి చెడింది. చంద్రబాబులా లోకేష్ వేరే వాళ్ళ మాటకి విలువనివ్వరు. వినరు. కనీసం పట్టించుకోరు అని అప్పట్లోనే బాగా అర్ధం చేసుకున్న ఈ నాయకులూ.. అప్పటికే కొందరు అభ్యర్థులకు ఆర్ధిక హామీలు ఇచ్చారు. వాటిని లోకేష్ నెరవేర్చకపోవడంతో వీళ్ళు నొచ్చుకుని.. చంద్రబాబుకి అసలు విషయం చెప్పేసి పార్టీ నుండి బయటకు వచ్చేసారు. అంటే సుజనా చౌదరి/ సీఎం రమేష్ వంటి నాయకులు పార్టీని వీడడానికి నూటికి నూరుపాళ్లు నారా లోకేష్ మాత్రమే కారణం. కాకపోతే అవి బయటకు చెప్పుకునేవి కాదు.

TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1
TDP Video: Acchennaidu Nara Lokesh Episode Part 1

సమన్వయం – నాయకత్వం – లోకేష్ నేర్చుకునేదెప్పుడు..!?

పార్టీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ ఎన్నడూ లేని కష్టాల్లో ఉంది. ఈ సమయంలో కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చి.. నాయకులకు అండగా నిలవాల్సింది పార్టీనే. చంద్రబాబుకి ఇటువంటివి కొత్త కాదు. 2004 లోనే ఆయన ఈ పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు బాబు దగ్గర లోకేష్ లేరు. లోకేష్ పార్టీలో యాక్టీవ్ లేరు. చంద్రబాబుకి పొలిటికల్ పుత్రోత్సాహం లేదు. కానీ ఇప్పుడు ఇది ఉంది. బాబుకి లోకేష్ రూపంలో ఒక మూళ్ళ కిరీటం నెత్తిన ఉంది. లోకేష్ కి రాజకీయ ఓనమాల్లో అచ్చులు, హల్లులు వదిలేసి నేరుగా గుణింతాలు నేర్పించారు. ఆయన ఇప్పుడు ఆ గుణింతాలు తప్పితే అచ్చులు, హల్లులు స్థాయి డి విషయాన్నీ డీల్ చేయలేకపోతున్నారు. వాటిని బాగా తెలిసిన నాయకులు పార్టీలో ఉన్నా వారికి విలువనివ్వడం లేదు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు చాలానే ఉన్నాయి. చంద్రబాబుకి తెలియనివి.. లోకేష్ విషయంలో రగులుతున్నవి.. అంతర్గతంగా జరుగున్న చర్చలు చాలానే ఉన్నాయి.. అచ్చెన్నకు కోపం రావడానికి ఈ అంతర్గత వ్యవహారాలే కారణం. లోకేష్ డీల్ చేస్తున్న విధానం పార్టీలో 80 % మందికి నచ్చడం లేదు. అందులో బయటపడిన వారు కొందరు, లోలోపల రగిలిపోయే వారు కొందరు.., ఇలా చీకటి వీడియోల్లో బయటపడే వారు కొందరు..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju