NewsOrbit
Featured బిగ్ స్టోరీ

TDP YCP; ఎన్నికల్లో బాబు మంత్రం ఫలించినట్టేనా..!? జగన్ ఏం నేర్చుకోవాలి..!? ఈ లెక్కలు చుడండి..!!

TDP YCP; Did Chandrababu win his Strategy

TDP YCP; నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున 76 శాతం పోలింగ్ నమోదవ్వగా.., మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున 62 శాతం ఓటింగ్ నమోదయింది. పట్టణ ఓటర్లంటే ఇళ్ల నుండి కదలరు.. ఓటు ఎప్పుడూ వేయరు.. కానీ పల్లె ఓటర్లు మాత్రం ఓట్లు అంటే ఆసక్తి చూపిస్తారు.

ఏపీలో ఎప్పుడు పల్లె ఎన్నికలు జరిగినా 72 శాతానికి తగ్గిన సందర్భాలే లేవు. 2014 లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 77 శాతం నమోదవ్వగా…, 2006 లో జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ శాతం నమోదయింది. కానీ నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం 60 .64 శాతం మాత్రం పోలింగ్ నమోదయింది. దీని వెనుక కారణాలు.., ఈ పరిణామాలు కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అంశాలే.

TDP YCP; Did Chandrababu win his Strategy
TDP YCP; Did Chandrababu win his Strategy

TDP YCP; నమోదైన ఓట్లలో కూడా ఎన్నో తేడాలు..!?

నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 శాతం ఓటింగ్.., అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 51 శాతం పోలింగ్ నమోదయింది. కొన్ని జిల్లాల్లో చివరి రెండు గంటల్లో అనూహ్యంగా పెరుగుదల కనిపించింది. గుంటూరు, కడప వంటి జిల్లాల్లో చివరి రెండు గంటల్లోనే 20 శాతానికి పైగా నమోదైనట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు, కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. సో.. నిన్నటి ఎన్నికల్లో నమోదైన ఓట్లలో కూడా కొన్ని తేడాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక పార్టీల వారీగా చూసుకుంటే నిజానికి ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే.., పోలింగ్ వేరేలా ఉండేది. ఎక్కడైనా ప్రత్యర్ధులు గట్టిగా తలపడితేనే పోటీపై ఆసక్తి ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ప్రత్యర్ధులు పోటాపోటీగా తలపడి, ప్రచారం చేసి, డబ్బులు పంచితేనే ఓటర్లకు ఓటింగ్ పై ఆసక్తి పుడుతుంది. కానీ ఈ పరిషత్ ఎన్నికలు అలా జరగలేదు. ఏకపక్షంగా జరిగాయి.

TDP YCP; Did Chandrababu win his Strategy
TDP YCP; Did Chandrababu win his Strategy

టీడీపీ పోటీ చేసి ఉంటె..!?

సహజంగా రాజకీయం అంటే.. రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు వారికీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం వైసీపీకి, టీడీపీకి అటువంటి ఓటు బ్యాంకు ఉంది. సగటున వైసీపీకి 35 శాతం ఫిక్స్ అయినా ఓటు బ్యాంకు ఉంది అనుకుంటే.., టీడీపీకి 30 శాతానికి పైగా ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉంటుంది. వీళ్ళు టీడీపీ పోటీ నుండి బహిష్కరించడంతో ఓటింగ్ పై కొంతమేరకు ఆసక్తి చూపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీడీపీ వాళ్ళు పోటీలో ఉన్నారు. ప్రచారం చేశారు. అటువంటి స్థానాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. రాష్ట్రం మొత్తం ఇదే జరిగితే ఓటింగ్ శాతం కచ్చితంగా పెరిగేది. సో.. పోటీని బహిష్కరించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయం చూపిస్తే… ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం ద్వారా కొన్ని వర్గాల ఓటర్లు కూడా ఎన్నికల పట్ల తమ అనాసక్తిని చూపించారు. ఇది టీడీపీకి విజయం కాదు.., కానీ సీఎం జగన్ కి ఒక చిన్న హెచ్చరిక లాంటిదే.

TDP YCP; Did Chandrababu win his Strategy
TDP YCP; Did Chandrababu win his Strategy

పడిన 60 శాతంలో కూడా కొన్ని లెక్కలు..!!

నిన్న జరిగిన పోలింగ్ లో 60 శాతం పోలింగ్ నమోదైంది. దీనిలో వైసీపీకి ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ఉన్న ఓట్లతో సహా.. జగన్ పట్ల, అతని పథకాల పట్ల ఆకర్షితులై వచ్చి వేసిన ఓట్లు లెక్కించుకుంటే.. సరాసరి 45 శాతం వైసీపీకి పడినట్టు ఓ అంచనాగా చెప్పుకోవచ్చు. టీడీపీ పోటీలో లేకపోయినప్పటికీ.. ఆ గుర్తు చూస్తేనే ఓటు వేయాలనిపించేవారు… అక్కడక్కడా పోటీ చేసిన వారికి పడిన ఓట్లు లెక్కించుకుంటే కనీసం 10 శాతం ఆ పార్టీకి వేసుకున్నా.. మిగిలిన ఓట్లు ఇతరులకు లెక్కించుకోవచ్చు. కానీ ఒకవేళ టీడీపీ పూర్తిస్థాయిలో పోటీకి దిగి ఉంటె.. వైసీపీ కూడా యాక్టీవ్ గా పాలిటిక్స్ చేసేది. పోటీ మజాగా ఉండేది. అప్పుడు ఓటింగ్ శాతం పెరిగేది. ఆ లెక్కన వైసీపీకి కూడా ఓట్లు పెరిగేవి. సో… ఎన్నికల బహిష్కరణ ద్వారా చంద్రబాబు వేసిన మంత్రం ఓ లెక్కన ఫలించినట్టే. సీఎం జగన్ అప్రమత్తమై.. సమీక్షించుకోవాల్సిన అంశమే..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju