NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

Telugu Cine Heros: హీరోలూ మీరున్నది భజనలకా..? సందేశాలకా..? సమాజానికా..!? నిరూపించుకోండి..!!

Telugu Cine Heros: Second Wave Silent Big Bhajana Heros

Telugu Cine Heros: ఒక సీఎం ఏదైనా ఓ చిన్న నిర్ణయం తీసుకుంటే … చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున సహా పెద్ద పెద్ద స్టార్లు అందరూ ట్విట్టర్లు, ఫేస్ బుక్కులు, ఇంస్టాగ్రాములు నింపేస్తారు. ఈ రోజు మొత్తం ఆ సీఎంల భజనలతో తరిస్తారు. ప్రత్యేకంగా కలిసి పూలు, పళ్ళు ఇచ్చి మరీ శుభాకాంక్షలు చెప్తారు. ఇదీ తెలుగు సినీ హీరోల బండారం… ఇళ్లల్లో, జేబుల్లో, వారి సోషల్ మీడియా ఖాతాల్లో చిడతలు పెట్టుకుని అవసరం ఉన్నా, లేకపోయినా.. వాయిస్తూ సీఎం కుర్చీలో ఎవరంటే వారికి భజనలు చేస్తుంటారు..! అది వారికి తప్పదు. తమిళ హీరోల్లాగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పలేరు. కేంద్రం వైఖరికి నిరసనగా సైకిళ్లపై తిరగలేరు. ఇక్కడంతా భజన బృందం. అభిమానులు వారి భజనలు చేస్తారు.. వాళ్ళు కుర్చీల్లో ఉన్నవారికి చేస్తారు. సరే… ఇప్పుడు ఈ మేటర్ అంతా ఎందుకు అంటే..!?

Telugu Cine Heros: Second Wave Silent Big Bhajana Heros
Telugu Cine Heros Second Wave Silent Big Bhajana Heros

Telugu Cine Heros: విపత్తులో ఎవరేం చేశారు…!?

కరోనా విపత్తు వచ్చింది. గత ఏడాది మొదటి దశలో కొంచెం ధాటి చూపించి.. అక్కడక్కడా ప్రాణాలు పట్టుకెళ్లిన కరోనా ఇప్పుడు రెండో దశలో ఏకంగా వేలాది ప్రాణాలకు ఎత్తుకెళ్తుంది. ఆక్సిజన్ అందక ఊపిరి తీసేస్తుంది. రెండో దశ ఏ ఒక్కరూ ఊహించని విలయ తాండవం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ విపత్తు సమయంలో ప్రభుత్వాలు పూర్తిగా చేసేదేమి ఉండదు. చేతనైనంత ఇస్తే ఇస్తారు.. లేదా మూసుకుని ఉంటారు. ఇప్పుడు ముందుకు రావాల్సింది హీరోలే.. సమాజంలో పెద్దలే..!

* కరోనా మొదటి దశలో తెలుగు హీరోలూ కాస్త స్పందించారు. అదేమి గొప్ప, పెద్ద స్పందన కాదు కానీ.. మరీ తీసిపారేయలేం. వందల కోట్లు పోగేసుకున్న హీరోలూ ఒక్కొక్కరూ కోటి, కోటిన్నర అలా ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్ రూ. 4 కోట్లు.., పవన్ కళ్యాణ్ 2 .., మహేష్ బాబు కోటి, చిరంజీవి కోటి, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు, బాలకృష్ణ కోటి, నాగార్జున కోటి ఇలా ఇచ్చారు. ఇది ఆ ఏడాదితో అయిపొయింది. కానీ ఇప్పుడు మరింత ముదిరింది. సాయం మరింత అవసరమైంది.

Telugu Cine Heros: Second Wave Silent Big Bhajana Heros
Telugu Cine Heros Second Wave Silent Big Bhajana Heros

* ఆక్సిజన్ అందక వేలాది మంది ఆసుపత్రుల బయట ప్రాణాలొదులుతున్నారు. డబ్బు పెట్టలేకపోతున్నారు. వాక్సిన్ కేంద్రం ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ కేంద్రం కూడా పీఎం కెర్స్ నుండి ఖర్చు చేస్తుంది. పీఎం కెర్స్ లో గత ఏడాది వచ్చిన రూ. 9 వేల కోట్లలో దీనికి కొంత ఖర్చు చేస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధి గుల్లాలు ఖాళీ అయ్యాయి. కరోనా కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కనిపించడం లేదు.

* హీరోలకు ఇదే సమయం. వందల కోట్ల నుండి మరోసారి కొన్ని కోట్లను వదులుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కరోనా తగ్గితే.. పెద్ద స్టార్లు అయితే ఒక్కో పది రోజుల్లో ఈ కోటి, రెండు కోట్లు వెనకేసుకోవచ్చు. చిన్న స్టార్లు అయితే నెలలో వెనకేసుకోవచ్చు. కానీ ఈ రోజులు.., ఈ విపత్కర పరిస్థితులు.., ఈ హృదయ విదారక దారుణాలు ఎదుర్కోవాల్సిన సమయం ఇదే.

Telugu Cine Heros: Second Wave Silent Big Bhajana Heros
Telugu Cine Heros Second Wave Silent Big Bhajana Heros

* భజనలు చేసే చేతితోనే మళ్ళీ మళ్ళీ మేము ఆడుకోడానికి ముందుంటాం అని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే. ఆక్సిజన్ కోసం రతన్ టాటా ఈ ఏడాది మళ్ళీ పెద్ద ఎత్తున వితరణకు ముందుకొచ్చారు. గత ఏడాది ఆయన రూ. 1500 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ ఏడాది మళ్ళీ రూ. 500 కోట్లకి సిద్ధమవుతున్నారు. ఆయన స్ఫూర్తిగా మీరూ అడుగులు వేయాల్సిన సమయం ఇదే. అడుగులు వేసేసి.. మీ భజనలు మీరు ఎక్కడైనా.., ఎన్నైనా చేసుకోవచ్చు. ఐటీ కళ్ళు మీపై పడవు.., మీ సినిమాలకు టికెట్లు ఆగవు, మీ థియేటర్లకు ఇబ్బందులు రావు.., మీ వ్యాపారాలకు అనుమతులు ఆగవు..!

 

author avatar
Srinivas Manem

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu