Samantha – Alia bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్..ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమె నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా టాలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది. త్వరలో అధికారికంగానూ ఆలియాను ఈ ప్రాజెక్ట్‌లో తీసుకున్న విషయాన్ని ప్రకటించబోతున్నారు. ఇక ఇప్పటికే ఆలియా ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న నెక్స్ట్ సినిమాలో ఆలియాను హీరోయిన్గా అడుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆలియా కూడా ఈ విషయాన్ని తెలిపింది. అల్లు అర్జున్ సినిమాలో కూడా నన్ను అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఆలియా డేట్స్ సర్దుబాటు చేస్తే మాత్రం అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక తాజాగా ఆలియా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. సమంత గనక ఒప్పుకుంటే ఆమెతో కలిసి నటించాలని ఉందంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది.
Samantha – Alia bhatt: సమంత, ఆలియా కలిసి సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్‌కు వచ్చే క్రేజ్ మరో లెవల్
టాలీవుడ్ ఇండస్ట్రీ మీద, హీరోల మీద పాజిటివ్ కామెంట్స్ చేసిన ఆలియా..మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు అని అడిగితే..చిన్న పాజ్ తీసుకొని సమంత అని చెప్పుకొచ్చింది. ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఈ వెబ్ సిరీస్‌తో విపరీతమైన పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ మేకర్స్ అలాగే అక్కడ స్టార్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. దాంతో సమంతకు హిందీలో కూడా యష్ రాజ్ లాంటి పెద్ద సంస్థల నుంచి అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాప్సీ నిర్మాణంలో కూడా సమంత ఓ సినిమాలో నటించనుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సమంత సరే అంటే ఆమెతో కలిసి ఆలియా ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉందట. నిజంగా సమంత, ఆలియా కలిసి సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్‌కు వచ్చే క్రేజ్ మరో లెవల్ అని చెప్పాలి.