RRR: “RRR” బ్యూటీ కి కరోనా పాజిటివ్..!! 

Share

RRR : “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “RRR”. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ బిగ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. చరణ్ సరసన హీరోయిన్ గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కి తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నట్లు, కరోనా కి సంబంధించి అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది.

Alia bhatt tested corona positive
Alia bhatt tested corona positive

అంతేకాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. “గంగుబాయి కాతీయ వాడి” సినిమా షూటింగ్ లో.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వెంటనే టెస్ట్ చేయించుకున్న ఆలియా భట్ కి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో సినిమా యూనిట్ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోనే ఈ సినిమా డైరెక్టర్ బన్సాలి కి కరోనా పాజిటివ్..నిర్ధారణ అయింది, ఆయన ఇటీవల కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కి కరోనా సోకడంతో.. సినిమా యూనిట్ సభ్యులు కంగారు పడుతున్నారు. “గంగుబాయి కాతీయ వాడి”  సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా వైరస్ విజృంభన ఉండటంతో .. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతూ ఉన్నట్లు .. తాజా వార్త పై బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.  


Share

Related posts

కరోనా లో కాదేదీ మోసానికనర్హం ! ప్లాస్మా పేరిట టోకరా !!

Yandamuri

దేశానికే క్రేజీ ప్రాజెక్ట్ ఇది : మహేశ్ – రాజమౌళి సినిమా మొదలవ్వాబోతోంది ?

GRK

ట్విట్టర్ పూనిన నాగ”బాంబు”…!

Srinivas Manem