న్యూస్ సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ ముందున్న టార్గెట్ చాలా పెద్దది…ఈసారి రీచ్ అవగలడా..?

Share

Pushpa 2: అల్లు అర్జున్ ముందున్న టార్గెట్ చాలా పెద్దది…ఈసారి రీచ్ అవగలడా..? అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారట. దీనికి కారణం ఇప్పుడు తనముందు ఉన్న టార్గెట్ చాలా పెద్దదే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌కు అమాంతం అసాధారణం గా క్రేజ్ పెరిగిపోయింది. దాంతోనే ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలు సాహో, రాధే శ్యామ్ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీనికి కారణం ఫ్యాన్స్‌లో పెరిగిన భారీ అంచనాలే. అదీకాక ప్రభాస్ సరైన కథలను ఎంచుకోకపోవడం.

allu arjun target is big now
allu arjun target is big now

ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా పుష్ప 1తో భారీ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ కూడా ఇలాంటి ఒత్తిడినే తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుష్ప 1 సినిమాకు బాలీవుడ్‌లో పెద్దగా ప్రమోషన్స్ చేయనే లేదు. కానీ, అక్కడ భారీగానే వసూళ్ళు రాబట్టింది. అల్లు అర్జున్‌కు హిందీ బెల్ట్‌లో సాలీడ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే, దీని తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు..ఇటీవల వచ్చిన కేజీఎఫ్ 2 కూడా హిందీ మార్కెట్‌లో భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే, ఈ సినిమా హిందీలో అల్లు అర్జున్ సాధించిన వసూళ్ళను బ్రేక్ చేసిందని చెప్పుకుంటున్నారు.

Pushpa 2: పాన్ ఇండియా రేంజ్‌లో పోటీ తట్టుకోవాలంటే ఎంత శ్రమించినా చాలదు.

దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ ముందు పాన్ ఇండియన్ స్థాయిలో భారీ టార్గెట్టే ఉంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ఈ పాటికే షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతూ ఉండేది. కానీ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలను మించి సక్సెస్ సాధించాలంటే సుకుమార్ ముందు అనుకున్న పుష్ప 2 స్క్రిప్ట్ సరిపోదని అందుకే, ఇప్పుడు విదేశాలలో దీని కోసం మరోసారి కొత్తగా కొన్ని మార్పులు చేసి పుష్ప 2 కోసం సాలీడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం ఎక్కువ శ్రమించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. తప్పదు మరి పాన్ ఇండియా రేంజ్‌లో పోటీ తట్టుకోవాలంటే ఎంత శ్రమించినా చాలదు.


Share

Related posts

ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట‌ర్వ్యూ

Siva Prasad

Chhota Rajan: కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..

bharani jella

కేసీఆర్‌కు మోదీ షాక్ః ఊహించ‌నిది కదా?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar