నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అటు తన రాజకీయ జీవితాన్ని ఇటు తన చలనచిత్ర జీవితాన్ని సజావుగా సాగిస్తూ ఒకే రకంగా ఆస్వాదిస్తూ దూసుకుపోతున్న బాలయ్య తన సతీమణి మరియు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను తన ఇంట్లోనే జరుపుకున్నాడు.
అయితే నందమూరి వారసుడు అయిన మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత ఆంధ్ర ప్రజానీకానికి కనిపించడం జరిగింది. ఇప్పటికే ఎంతోమంది మోక్షజ్ఞ త్వరలోనే తన సినీ అరంగేట్రం చేస్తాడు అని అంతా భావిస్తుండగా ఫోటోలో మోక్షజ్ఞ చూస్తే ఆ సన్నాహాల్లో ఉన్నట్లు కనిపించడం లేదు. చాలా క్యాజువల్ గా నీలం రంగు టీ షర్ట్ వేసుకున్న మోక్షజ్ఞ సినిమా హీరో కి ఉండవలసిన ఫిట్ నెస్ తో అయితే లేడు.
ఇక బాలయ్య మాత్రం పట్టు వస్త్రాల్లో కనిపించగా నందమూరి అభిమానులు అంతా బాలకృష్ణ వారసుడు ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా…. ఎప్పుడెప్పుడు అక్కున చేర్చుకుందామా అని వేచి ఉన్నారు. మరి త్వరలోనే మోక్షజ్ఞ ఆ రకంగా ప్రయత్నాలు మొదలు పెడతాడో లేదో వేచి చూడాలి.