సినిమా

Bala Krishna: దబిడి దిబిడే: రొమాంటిక్ లేడితో రొమాన్స్ చేయనున్న బాలయ్య!

Share

Bala Krishna: ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాలయ్య మంచి ఖుషిగా వున్నాడు. పనిలో పనిగా ఓ మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టేసాడు. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది బాలయ్యకు 107వ చిత్రం కావడంతో ‘ఎన్బీకే 107’ అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేసి, సెట్స్ మీదకు వెళ్లారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘అన్నగారు’ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలించినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి.

Bala Krishna to have a romance with a romantic lady!
Bala Krishna to have a romance with a romantic lady!

ఐటెం సాంగ్ లో ఐటెం భామ ఆమెనే అట:

ఇకపోతే గోపిచంద్ మలినేని – బాలయ్య కాంబోలో ఓ అదిరిపోయే ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉందట. సినిమాకే హైలెట్ గా నిలిచే ఆ స్పెషల్ సాంగ్ కోసం ‘డింపుల్ హయతిని’ సంప్రదించారట. ఇటీవల ఈ భామ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా నటించి, మెప్పించిన సంగతి తెలిసినదే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో డింపుల్ హయతికి అవకాశాలే కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘ఎన్బీకే 107’లో స్పెషల్ సాంగ్ చేసేందుకు వెంటనే ఆమె ఓకే చెప్పిందని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బాలయ్య, డింపుల్ హయతిలపై ఆ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట.

Bala Krishna to have a romance with a romantic lady!
Bala Krishna to have a romance with a romantic lady!

మరింత సమాచారం:

ఇకపోతే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో సెకెండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.


Share

Related posts

నా కెరీర్ బెస్ట్ ఫిలిమ్: భీమనేని

Siva Prasad

Kajal Aggarwal Beautiful Photos

Gallery Desk

స‌మంత షాకింగ్ రిప్లై

Siva Prasad