33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: OTT లోకి వచ్చేసిన చిరంజీవి సూపర్ హిట్ మూవీ “వాల్తేరు వీరయ్య”..!!

Share

Waltair Veerayya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుర్ర హీరోల కంటే చాలా స్పీడ్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలు చేసే విషయంలో చిరంజీవి స్పీడు అందుకోలేకపోతున్నారు. పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కేవలం ఒక సినిమా మాత్రమే రిలీజ్ చేశారు. కానీ చిరంజీవి మూడు సినిమాలు రిలీజ్ చేశారు. గత ఏడాది “ఆచార్య”, “గాడ్ ఫాదర్” రిలీజ్ చేయగా ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సంక్రాంతి పండుగ కానుకగా “వాల్తేరు వీరయ్య” తో ప్రేక్షకులను అలరించారు. ఏకంగా ఈ సినిమా 250 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించి… సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Chiranjeevi's super hit movie Waltair Veerayya which came to OTT

మాస్ మహారాజ రవితేజతో కలిసి చిరంజీవి నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. అన్నదమ్ములుగా చిరంజీవి రవితేజ నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. సినిమాలో ప్రతి సన్నివేశం హైలైట్ అయ్యేలా దర్శకుడు బాబి పనితనం సినిమాలో అద్భుతంగా కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఎంతగానో అలరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 27వ తారీకు నుండి అనగా ఈరోజు నుండి OTT ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Chiranjeevi's super hit movie Waltair Veerayya which came to OTT

దీంతో థియేటర్ లలో… విడుదలయ్యి బాక్సాఫీస్ షేక్ చేసిన వీరయ్య…OTTలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. OTT ట్రెండ్ అందుబాటులోకి వచ్చిన నాటి నుండి చిరంజీవి సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ తరహాలోనే వాల్తేరు వీరయ్య కూడా అదే OTT లో స్ట్రీమింగ్ కావడం విశేషం. కాగా ప్రస్తుతం చిరంజీవి “బోలా శంకర్” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడదిలోనే ఆగస్టు 11 వ తారీకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే గత ఏడాది రెండు ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ నీ చిరంజీవి పలకరిస్తున్నారు.


Share

Related posts

Jr NTR Posani Krishna Murali : హీరో కాకముందు జూనియర్ ఎన్టీఆర్ ను ఆ విధంగా చేసేవారు.. వైరల్ గా మారిన పోసాని వ్యాఖ్యలు..!

Teja

ప‌దేళ్ల త‌ర్వాత నితిన్‌తో

Siva Prasad

నా ల‌వ‌ర్ క్రికెట‌ర్ కాదు: తాప్సీ

Siva Prasad