Fitness NetFlix: ఫిట్ నెస్ అనేది కేవలం ఫిజికల్ గా మంచి లుక్ తెచ్చేందుకు కాదు. ఇది నీ మానసిక స్థితిని అలాగే నీలో ఆధ్యాత్మికత భావనను ప్రభావితం చేస్తుందని అంటారు ఫిట్నెస్ ట్రైనర్ స్. ఫిట్ నెస్, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న గ్యాప్ ను భర్తీ చేసేందుకు ప్రయత్నం చేయాలి.. ఆధ్యాత్మికత నిజానికి మన మనస్సుకు సంబంధించిన విషయం. మన ఆలోచనలు, మనం చేసే పనులు ఇవన్నీ దీంతో ముడిపడి ఉంటాయి. మనం మానసికంగా బలపడతాం.. ఫిట్ నెస్ గా ఉండే మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. అదే ఫిట్ నెస్ ఉన్న సినిమాలు కిక్ బాక్సింగ్, హాకీ ప్లేయర్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ ఫిబ్రవరి నెల అంతా ఎంజాయ్ చేయండి.. ఆ సినిమాలు ఏంటో చూద్దాం..

1. కొనన్ ది బార్బేరియన్..
ప్రముఖ ఇంగ్లీష్ కథానాయకుడు ఆర్నాల్డ్ హీరోగా నటించిన ఫిట్నెస్ కల్ట్ క్లాసిక్ సినిమా కొనన్ ది బార్బేరియన్.. జాన్ మిలియస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను మిలియస్ ఆలీవర్స్టార్ స్టోన్ రచించారు.. ఈ సినిమా లో ఆర్నాల్డ్ స్వార్జీనేగర్, జేమ్స్ ఎర్లీ జోన్స్ నటించారు. తుల్సా డుమ్ చేతిలో తన తల్లిదండ్రుల మరణానికి ప్రతికారం తీర్చుకునే కోనన్ అనే అనాగరిక యోధుని కథను ఈ సినిమా తెలియజేస్తుంది.. ఫిట్నెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 20 మిలియన్ల డాలర్స్ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా 79 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అనూహ్యమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాను హోం వీడియోలో విడుదల చేసిన ప్రతిసారి అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంది 2007 నాటికి ఈ సినిమా వసూళ్లు 300 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. ఈ సినిమాకు రీమేక్ గా 1984 లో డిస్ట్రాయర్ వచ్చింది. అలాగే 2011లో మరోసారి రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఈ సినిమా అవుతుంది.
జనరేషన్ ఐరన్:
జనరేషన్ ఐరన్ సినిమా అనేది 2013 అమెరికన్ డాక్యుమెంటరీ సినిమా.. ఇది 2012 మిస్టర్ ఒలింపియా కోసం శిక్షణ, పోటీలోఉన్న ప్రపంచంలోని ప్రముఖ ప్రొఫెషనల్ బాడీబిల్డర్‌లను లో ఇది కూడా ఒకటి. 1977 నాటి డాక్యుమెంటరీ పంపింగ్ ఐరన్‌కి ఆధ్యాత్మిక సీక్వెల్‌గా పరిగణించబడుతున్న ఈ చిత్రం ఫిల్ హీత్ , కై గ్రీన్ , బ్రాంచ్ వారెన్ , డెన్నిస్ వోల్ఫ్‌లతో సహా క్రీడలోని టాప్ ఏడు బాడీబిల్డర్‌ల జీవితాలకు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ రూర్కే కథనం అందించారు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ , లౌ ఫెర్రిగ్నో, జే కట్లర్‌లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మిలియన్ డాలర్ల కు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. ఫిట్నెస్ జోన్లో ఈ సినిమాను నెట్ ఫ్లిక్ లో చూసి మీరు ఆనందించండి.
స్టలోన్ రాకీ:
భారతీయ ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల్ని అంతంత మాత్రంగానే చూస్తున్న రోజుల్లో విడదలైంది రాకీ సినిమా. ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన నటుడు తన యాక్టింగ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. రాకీ పాత్రలో కనిపించి తన లుక్స్, ఫిజిక్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు. ఆ సినిమాకి వచ్చిన సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయంటే ఆయన పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ యాక్టర్ అయినా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో సిల్వెస్టర్ స్టలోన్.. 70వ దశకంలో ఆయన ఓ సెన్సేషన్. యూత్ కు ఇన్ స్పిరేషన్. అమ్మాయిల కలల రాకుమారుడు. రాకీ, ర్యాంబో పాత్రలు అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశాయి. సిల్వెస్టర్ రిస్కీ షాట్స్, అదిరిపోయే స్టంట్స్ చూసి అందరూ నోరెళ్లబెట్టేవారు. ఎంత రిస్కీ యాక్షన్ సీన్స్ అయినా డూప్ లేకుండానే చేసేవాడు. ఈ సినిమా ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ను మీరు ఓ సారి చూసేయండి..
మిలియన్ డాలర్ బేబీ .. అమెరికన్ డ్రామా చిత్రం మిలియన్ డాలర్ బేబీ .. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్లింట్ ఈస్ట్‌వుడ్దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సినిమాలో ఈస్ట్‌వుడ్ నటించారు. హిల్లరీ స్వాంక్ ఇందులో ఇది అద్భుతమైన చూపించారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు సహా నాలుగు అకాడమీ అవార్డులను పొందింది అంటే ఈ సినిమాకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనమే. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న ఈ సినిమా చూడవచ్చు.
హుప్ డ్రీమ్స్:
ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారులుకావాలనే వారి కలల సాకారం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేసే సినిమానే హూప్ డ్రీమ్స్.. ఈ సినిమా 1994 లో స్టీవ్ జేమ్స్ దర్శకత్వం వహించిన అమెరికన్ డాక్యుమెంటరీ చిత్రం. కార్టెంక్విన్ ఫిల్మ్స్‌తో కలిసి ఫ్రెడరిక్ మార్క్స్ , జేమ్స్ మరియు పీటర్ గిల్బర్ట్ నిర్మించారు. ఇది చికాగోలోని ఇద్దరు ఆఫ్రికన్-అమెరికన్ హైస్కూల్ విద్యార్థులు,విలియం గేట్స్ , ఆర్థర్ ఏజీ మరియు ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారులుకావాలనే ఎలా అయ్యారు అనేది ఈ సినిమా .. ఈ చిత్రం హాలీవుడ్ తో పాటు అన్ని భాషల లోనూ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది.