Harish Shankar: డైరెక్టర్ హరిష్ శంకర్ అందరికీ సుపరిచితుడే. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో చేసిన “గబ్బర్ సింగ్” హరీష్ కీ ఎంతో పేరు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం రెండోసారి పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా హరీష్ చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది. అయితే పవన్ సినిమా మొదలుపెట్టకు ముందే నటసింహం నందమూరి బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నట్లు హరీష్ ప్రకటన చేశారు.
విషయంలోకి వెళ్తే బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” సంక్రాంతి పండుగ కానుకగా ఇటీవల విడుదల కావడం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్.. సంస్థ నిర్మించడం జరిగింది. “వీరసింహారెడ్డి” సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ… త్వరలోనే బాలయ్య బాబుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ నేనే డైరెక్ట్ చేశాను. ఆ ఒక్క సీన్ కీ అంతా రెస్పాన్స్ వస్తే…ఇక సినిమా చేస్తే…త్వరలో ఆయనను ఒప్పించే స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పటినుండో ఎదురుచూస్తున్నట్లు.. చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు మంచి విజయాలు ఇవ్వటంతో సదరు అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. అదే రీతిలో మీతో అదిరిపోయే సినిమా చేసి.. మీ అభిమానుల ఆదరణ కూడా పొందుకోవాలని ఎదురుచూస్తున్నాను సార్ అని హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా, సాహిత్యం, భాష, సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు అని.. బాలయ్య బాబునీ ఉద్దేశించి హరీష్ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. హరీష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. హరీష్ సినిమా ఓకే అయితే అదరగొడుతుందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!