Pushpa: ఐకెన్ స్టార్ బన్నీ “పుష్ప” సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయాడు. “పుష్ప” రాకముందు దక్షిణాదిలో మాత్రమే బన్నీకి క్రేజ్ ఉంది. కానీ యూట్యూబ్ లో బన్నీ హిందీ డబ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చేవి. దీంతో గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ₹100 కోట్లు.. రాబటింది. ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ధియేటర్లలో విడుదలయ్యి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.
“పుష్ప” సినిమాతో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో డైలాగులు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. బన్నీ మేనరిజం.. సినిమాలో స్టెప్పులు కూడా చాలా వైరల్ కావడం జరిగింది. సుకుమార్ బన్నీ ఇంకా నిర్మాతలు కూడా ఊహించని విధంగా “పుష్ప” విజయం సాధించింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు “పుష్ప” నీ రష్యాలో కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 8వ తారీఖున రష్యా భాషలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు పుష్ప రష్యా భాష ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఇక సరిగ్గా రిలీజ్ కి ముందు డిసెంబరు 1న మాస్కోలో, డిసెంబరు 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో “పుష్ప” ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం మరిన్ని ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎక్కువ ట్విస్టులు సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం.