Hero Sumanth : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వారి నటన నైపుణ్యం వల్ల ఇండస్ట్రీలో హవా కొనసాగుతుంది. మరికొందరు వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాంటి వారిలో అక్కినేని వారసుడు కూడా ఉన్నారని చెప్పవచ్చు.అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా ప్రేమకథా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుమంత్ ఒక్క హిట్ కూడా అందుకోలేకుండా పోయాడు. ఒకవైపు ఏఎన్ఆర్ మనవడిగా మరొకవైపు నాగార్జున మేనల్లుడిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకోలేక పోయారు.
సుమంత్ హీరోగా యువకుడు, సత్యం, గోదావరి, పౌరుడు, గౌరీ, గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలలో నటించిన మంచి కుటుంబం సంపాదించుకోలేక పోయాడు. నటనలో మంచి నైపుణ్యం ఉన్నా సుమంత్ ఈ విధంగా కెరీర్ లో ముందుకు సాగకపోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉందని సమాచారం. అదేమిటంటే సుమంత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేయడం వల్ల ఆ సినిమాలను వేరే హీరోలు చేయడంతో వారు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే సుమంత్ వదిలేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఏమిటో తెలుసుకుందాం…
హీరో సుమంత్ వదిలేసుకున్న సూపర్ హిట్ చిత్రాలు ఇవే..
బాలనటుడిగా పరిచయం అయిన తరుణ్ నువ్వేకావాలి సినిమాలో మొదటగా సుమంత్ కి అవకాశం వస్తే రిజెక్ట్ చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, నువ్వొస్తావని, మనసంతా నువ్వే, ఆనందం, ఇడియట్, దేశముదురు, గమ్యం, నా అష్టా చమ్మా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకొని ఫ్లాప్ చిత్రాలలో నటించడం వల్ల తన కెరియర్ ఆగిపోయిందని చెప్పవచ్చు. అదేవిధంగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ ఈ సినిమాను కూడా వదులుకున్నారు.ఈ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోనప్పటికీ మిగిలిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలన్నింటిని సుమంత్ హీరోగా చేసి ఉంటే సుమంత్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేవారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుమంత్ కపటదారి సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ద్వారా ఆయన సుమంత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.