KGF 2: “కేజిఎఫ్ 2” థియేటర్లలో సందడి చేస్తోంది. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ ఫస్ట్ కన్నడలో తీయగా..సూపర్ విజయం సాధించడం జరిగింది. దీంతో సినిమాకి ఊహించని రెస్పాన్స్ రావడంతో..మిగతా భాషల్లో విడుదల చేయగా అన్ని చోట్ల.. సూపర్ డూపర్ హిట్ కావడం…మాత్రమే కాదు డబ్బింగ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఈ దెబ్బతో ఇప్పుడు “కేజిఎఫ్ 2” ఎప్పుడు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది.ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు ఇప్పటికే వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరోపక్క సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో “కేజిఎఫ్ 2” సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేయడం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల సినిమా యూనిట్ పర్యటించి అనేక చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించడం హైదరాబాదులో ఫంక్షన్ చేయడం జరిగింది. యాంకర్ సుమకి కూడా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్..హీరో యాష్.
ఈ తరుణంలో సినిమాకి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తూ రావు రమేష్ క్యారెక్టర్ గురించి కొత్త విషయం చెప్పుకొచ్చారు. మొదట రావు రమేష్ క్యారెక్టర్ నాలుగు రోజులు కాల్షీట్స్ మాత్రమే అనుకున్నాను. కానీ ఆయన టాలెంట్ మాట్లాడే విధానం నటన చూసి చివరాకరికి 14 రోజుల కాల్షీట్స్.. ఉండేలా ఆయన పాత్ర స్క్రిప్టులో మరింత పెరిగేలా మార్పులు చేర్పులు చేశాం గ్యారెంటీ..”కేజిఎఫ్ 2″ లో రావు రమేష్ క్యారెక్టర్ కీలకమని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రావు రమేష్ క్యారెక్టర్ గురించి చాలామంది తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.