KGF2 Bahubali2: “కేజిఎఫ్ 2” ఏప్రిల్ 14 తారీకు విడుదల అయ్యి అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. అంబేద్కర్ జయంతి నాడు ఆ తర్వాత గుడ్ ఫ్రైడే తో పాటుగా వీకెండ్ రావడంతో “కేజిఎఫ్ 2″ కి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ అయిన రోజే సెకండ్ షో పడకముందే.. వంద కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ హీరో యాష్ పర్ఫార్మెన్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టడంతో…”కేజిఎఫ్ 2” దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” కి సంబంధించి అనేక రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సినిమా రిలీజ్ అయిన ఐదు రోజులకే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన బాహుబలి సెకండ్ పార్ట్ కి సంబంధించిన రికార్డు “కేజిఎఫ్ 2” పగలగొట్టడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐదు రోజుల్లోనే దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేయడం తెలిసిందే. అయితే ఈ మార్క్ “బాహుబలి 2” అందుకోవటానికి ఆరు రోజులు పట్టిందట. కానీ బాహుబలి కంటే తక్కువ టైంలో ఇతర ఇండస్ట్రీకి చెందిన సినిమా బాలీవుడ్ లో… 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా “కేజిఎఫ్ 2” సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా “కేజిఎఫ్ 2″ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 28 కోట్లకు పైగా వసూలు చేసింది. నిన్న రూ. 5.55 కోట్లను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మళ్లీ దాదాపు రెండు వారాల పాటు మధ్యలో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో…”కేజిఎఫ్ 2” పూర్తి రన్ టైం లో మరి ఇంత కలెక్షన్లు సాధించడం గ్యారెంటీ అని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కేజీఎఫ్ మొదటి చాప్టర్ కంటే సెకండ్ చాప్టర్.. అదరగొట్టడంతో రెండు వారాలకు కలెక్షన్లు డోకా ఉండదని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.