న్యూస్ సినిమా

RRR – Radhe shyam: ప్లాన్ మార్చుకోవాల్సిందే..ఇది మేకర్స్‌కు పెద్ద షాక్..!

Share

RRR – Radhe shyam: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న రిలీజ్ అనుకుని వాయిదా పడిన ఈ సినిమా కోసం మళ్ళీ రెండు విడుదల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ఒమైక్రాన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. మరోవైపు మార్చి 18న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గనక రిలీజ్ చేయకపోతే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారట. అయితే, ఇప్పుడు రెండు సినిమా నిర్మాతలు మార్చి 18ని మర్చిపోవాల్సిందే.

makers of rrr-radhe-shyam-should change their plans
makers of rrr-radhe-shyam-should change their plans

ఈ తేదీన రిలీజ్ చేయాలనుకున్న ‘ఆర్ఆర్ఆర్’,’రాధేశ్యామ్’ విడుదల చేయాలనే ఆలోచనను రెండు చిత్రాల దర్శక నిర్మాతలు విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దివంగత కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్‌తో డబ్బింగ్ చెప్పించి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

RRR – Radhe shyam: ఆలోచన ఇక మానుకోవాల్సిందే తప్ప మరో దారి లేదు.

అయితే, పునీత్‌కు నివాళిగా ఆయన గౌరవార్థం మార్చి మూడో వారంలో ఏ చిత్రాన్ని ప్రదర్శించకూడదని కన్నడ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 17 నుంచి 23వ తేదీ వరకు భాషా చిత్రాలను విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. ఈ రకంగా కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మూడో వారంలో అన్ని థియేటర్లలో పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించబడుతుంది. దీని మూలంగా ‘ఆర్.ఆర్.ఆర్’ అలాగే ‘రాధే శ్యామ్’ సినిమాలను కన్నడల ప్రదర్శించలేరు. కాబట్టి మార్చ్ 17 లేదా 18 తేదీలలో ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలను రిలీజ్ చేయాలనే ఆలోచన ఇక మానుకోవాల్సిందే తప్ప మరో దారి లేదు.


Share

Related posts

Balakrishna: బాలకృష్ణ నెక్స్ట్ సినిమా షూటింగ్ డీటెయిల్స్..!!

sekhar

వాళ్లే నా బలం.. వాళ్లు లేకపోతే..? రష్మిక మందన్న

Varun G

జగన్ నిర్ణయాలు మంచివా..? కోర్టు తీర్పులు సబబా..?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar