నాగార్జున అక్కినేని టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మన్మథుడు మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు డిజిటల్ పరంగా మంచి బిజినెస్ జరిగింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్ హక్కులను దక్కించుకుందని సమాచారం. శాటిలైట్ హక్కుల కోసం మంచి పోటీయే నెలకొందని టాక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటైనర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
previous post
next post