Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కెరియర్ అనుభవిస్తూ ఉన్నారు. వయసు మీదపడుతున్న గాని నెంబర్ మారటం తప్ప ముఖంపై చిన్న మడత గాని కెరియర్ పరంగా వేగం తగ్గటం కానీ ఎక్కడా లేకుండా .. అక్కినేని సత్తా ఏంటో నిరూపిస్తూ వస్తున్నారు. సొంత కొడుకు ల అందానికి ఏమాత్రం పొంతన లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా అదిరిపోయే జెట్ స్పీడుతో నాగార్జున సినిమాలు చేస్తున్నారు.
కొడుకుల విషయానికొస్తే నాగచైతన్య…అనేక విజయాలు సాధిస్తూ సక్సెస్ఫుల్ హీరో అయిన సంగతి తెలిసిందే. ఇక చిన్నవాడు అఖిల్ .. అందం, డాన్స్, ఫైట్స్ పరంగా అంతా బాగానే ఉన్న.. ఇప్పటికి ఒక్క హిట్ పడలేదు. దీంతో అఖిల్ కోసం అనేక ప్రయోగాలు కూడా నాగార్జున చేయడం జరిగింది . ఎలాగైనా అఖిల్ కి ఒక హిట్ పడాలని ..తండ్రిగా నాగార్జున ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఇక నేరుగా రంగంలోకి దిగాలని నాగార్జున తాజాగా డిసైడ్ అయ్యి అఖిల్ తో మల్టీస్టారర్ సినిమా చేసి విజయం వరించేలా అండర్ గ్రౌండ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో మంతనాలు జరిపి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తో పెద్ద కొడుకు నాగచైతన్య తో సినిమాలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి అఖిల్ విజయం కోసం సరికొత్త ప్రయోగం చేయడానికి మల్టీస్టారర్ తరహాలో నాగార్జున నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అఖిల్ రిజిస్టర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా చేయడం జరిగింది. త్వరలో ఇది రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్