Nayan-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచీ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన `నేను రౌడీనే` సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. మొదట నయన్, విఘ్నేశ్‌లు తమ ప్రేమను బహిర్గతం చేయకపోయినా.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం, తరచూ కలిసి వెకేషన్లకు వెళ్లడంతో అందరికీ వీరిద్దరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
అయితే ఇప్పుడు ఈ ప్రేమ పక్షులు తమ సుదీర్ఘ ప్రేమప్రయాణాన్ని పెళ్లి బంధంగా మార్చుతూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న నయన్, విఘ్నేష్‌లు.. త్వరలోనే వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో టేబుల్ మీద రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ట్రై చేయమని విఘ్నేశ్ ప్రేమగా అడగ్గా నయన్ వద్దంటూ క్యూట్‌గా తలూపింది. అయినా సరే విఘ్నేష్ వినకుండా నయన్ భుజం మీద చేయి వేసి బుజ్జగిస్తూ ఆమెకు గోరుముద్దలు తినిపించాడు.
ఆ తర్వాత అతడు తిన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ `బాగా తినడానికి సమయం ఆసన్నమైంది.. స్థానికంగా దొరికే రుచికరమైన ఆహారాన్ని తనకు తినిపించడంలోనే అసలైన సంతోషం ఉంది.` అంటూ రాసుకొచ్చాడు. దీంతో విఘ్నేష్ పోస్ట్ చేసిన వీడియో కాస్త అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది.
https://www.instagram.com/reel/Cd7jg87JW2h/?utm_source=ig_web_copy_link
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…
ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…