Salaar: నేషనల్ స్టార్ ప్రభాస్ ఇటీవలె `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదే `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ కిరాగందుర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. గత ఏడాదే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. మేకర్స్ సెకెండ్ షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించారు. అయితే రెండో షెడ్యూల్ ప్రారంభమైన తొలి రోజే లీకులు వీరులు సలార్ టీమ్‌కు షాక్ ఇచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
షూటింగ్ స్పాట్‌లోని ప్రభాస్ ఫొటోలను ఎవరో షూట్ చేసి నెట్టింట లీక్ చేశారు. ప్రభాస్ కూర్చున్న ఫొటో, ఎవరో అమ్మాయితో ఆయన మాట్లాడుతున్న ఫొటో మరియు సెట్ కు సంబంధించిన ఫొటోను బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయిఏ సలార్ టీమ్‌కు లీకుల బెడద ఏమీ కొత్త కాదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గతంలో కూడా చాలా సార్లు సెట్స్ నుంచీ ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. మరి షాకుల మీద షాకులు ఇస్తున్న లీకుల వీరుల విషయంలో చిత్ర టీమ్ ఇప్పటికైనా మేల్కొని కఠిన చర్చలు తీసుకుంటారో..లేదో..చూడాలి. కాగా, హై బడ్జెటతో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సలార్ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!