నితిన్ చేతిలో బాలీవుడ్ సినిమా అనగానే.. మన హీరో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తాడని కాదు.. నితిన్ హీరోగా చేయడమే కాదు.. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సినిమాలను కూడా నిర్మిస్తుంటాడు. సినిమాల నిర్మాణంలో భాగంగా తాజాగా నితిన్ ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నాడట. ఆ సినిమా ఏదో కాదు.. `అంధాదూన్`. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా నిలిచిన ఆయుష్మాన్ ఖురానా ఇందులో హీరోగా నటించాడు. తెలుగు రీమేక్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు నితిన్ దక్కించుకున్నాడు. భీష్మ, రంగ్ దే చిత్రాల తర్వాత నితిన్ వచ్చే ఏడాదే నితిన్ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయని సమాచారం.
previous post
next post