న్యూస్ సినిమా

Prabhas – Maruthi: ఈ ఏడాది సెట్స్ మీదకు రానట్టేనా..లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!

Share

Prabhas – Maruthi: సాహో, రాధే శ్యామ్ సినిమాలతో వరుసగా రెండు భారీ ఫ్లాప్స్ చుశాడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాలలో ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ గనక హిట్ సాధించి ఉంటే ఆ లెక్కలు మరోలా ఉండేవి. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ బాగానే నష్టపోయారు. దాంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి మాత్రం భారీ హిట్ కొట్టాలని కసితో షూటింగ్ చేస్తున్నాడు. అయితే, ఈ ఏడాదిలోనే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తాడని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

prabhas-maruthi-project will be delayed
prabhas-maruthi-project will be delayed

ఆ సినిమా మరేదో కాదు..దర్శకుడు మారుతీ తెరకెక్కించాల్సిన సినిమానే. మారుతీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం పలు భారీ సెట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. దాదాపు ఈ సెట్స్‌లో ప్రభాస్ – మారుతి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని..ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ కేవలం 40 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడని ప్రచారం అవుతోంది. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మారుతి తెరకెక్కించనున్నాడట. అయితే, ఈ జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుందని నిన్నా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

Prabhas – Maruthi: 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్..?

అయితే, తాజా సమాచారం మేరకు ఈ ఏడాది ప్రభాస్ – మారుతిల సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేవంటున్నారు. దీనికి కారణం ప్రభాస్ ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ ఎంటర్‌టైనర్ సలార్ సినిమా షూటింగ్ కోసం బల్క్ డేట్స్ ఇవ్వడమేనట. ఆ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రభాస్ పూర్తి చేసి అప్పుడు గానీ మారుతి సినిమాను మొదలు పెట్టబోడని తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చే ఏడాది తీసుకువచ్చి 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. ఇదే జరిగితే అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టమే. చూడాలి మరి దీనిపై మేకర్స్ ఏమని క్లారిటీ ఇస్తారో.


Share

Related posts

అమిత్‌షాకు నిరసన సెగ

somaraju sharma

Sarkaru vari pata : పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో సర్కారు వారి పాటకి సిద్దం..?

GRK

బోగస్ ఓట్లు: ఈసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Siva Prasad