Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న పూరి..??

Share

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపుల మీద ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా పూరి సినిమాతో హిట్టు కొట్టాలని సినిమా కోసం బాగా కష్ట పడుతున్నారు. మరోపక్క పూరి జగన్నాథ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. “లైగర్” అంతకు మించి అని.. తన కెరియర్ లోనే బెస్ట్ సినిమా..కచ్చితంగా ఇదే అవుతుందని గత లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో తెలియజేశారు.

Puri Jagganath plans surprise gift for vijay devarakonda fans..!!
Puri Jagganath plans surprise gift for vijay devarakonda fans..!!

చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో..హీరోలను వెరైటీగా చూపించటంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు… పూరి మరోసారి తన పెన్ పవర్.. చూపించబోతున్నట్లు ఫిలిం వర్గాలలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ కి “అర్జున్ రెడ్డి” కి మించిన విజయం పూరి జగన్నాథ్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతో ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కాబోతున్నాడు.

కరణ్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో బాలీవుడ్ వర్గాలు కూడా రకరకాల డిస్కషన్లు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మే 9 వ తారీకు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావటంతో రౌడీ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటానికి పూరి జగన్నాథ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వెళ్తే “లైగర్” విజువల్ గ్లింప్స్.. రిలీజ్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లు టాక్. 


Share

Related posts

ముగ్గురిలో ఎవ‌రు ?

Siva Prasad

YSR Jayanti: వైఎస్ షర్మిలకు జగన్ దూరంగా ఉండటానికి కారణం ఇదే..! క్లారిటీ ఇచ్చిన వైసీపీ ముఖ్యనేత..!!

somaraju sharma

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షోకు తగ్గుతున్న ఆదరణ? కారణం తెలిస్తే షాకే?

Varun G