Radheshyam: పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే నిర్మాతలను భారీ లాభాలు వచ్చినట్టు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఇది మన డార్లింగ్ స్టామినా అని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సాధారణంగా రిలీజ్ డేట్ ప్రకటించాక ప్రీ రిలీజ్ బిజినెస్ చిన్న సినిమా నుంచి
మీడియం బడ్జెట్ భారీ బడ్జెట్ చిత్రాలకు జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ఇంకా నెలపైనే ఉంది. అప్పుడే దాదాపు రూ. 150 కోట్ల వరకు నిర్మాతలకు చేరాయని లేటెస్ట్ న్యూస్. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరికి యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ – సిరీస్, గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి, కృష్ణంరాజు కూతురు ప్రశీద కూడా నిర్మాతగా మారారు. వంశీ – ప్రమోద్‌లతో కలిసి ప్రశీద దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, చైనీస్, జపానీస్ భాషలలో అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది.
Radheshyam: ‘రాధేశ్యామ్’ మూవీతో మన డార్లింగ్ ప్రభాస్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్..!
అయితే, ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రాని మార్చ్ 11వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు బిజినెస్ అయిందట. అంటే రిలీజ్‌కు ముందే నిర్మాతలకు రూ. 150 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు అర్థమవుతోంది. ఇది
ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ వరకు..’రాధేశ్యామ్’ రిలీజ్ తర్వాత ఏ రేంజ్‌లో లాభాలను తెచ్చిపెడుతుందో అని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే ‘రాధేశ్యామ్’ మూవీతో మన డార్లింగ్ ప్రభాస్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనిపిస్తోంది.