Rahul Ramakrishna : ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరినీ ఫూల్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ కమెడియన్‌గా సత్తా చాటుతున్న రాహుల్ రామకృష్ణ నిన్న తన ట్విట్టర్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టాడు. అందులో 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేస్తానని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
దీంతో ఏం జరిగిందో తెలీక, అసలు రాహుల్ రామకృష్ణ ఎందుకు సినిమాలకు దూరం అవుతున్నాడో అర్థంగాక జుట్టు పీక్కున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై రాహుల్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. `జోక్ చేశానంతే. భారీ రెమ్యునరేషన్, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తుంటే ఎందుకు కాలదన్నుకుంటాను. నేను రిటైర్మెంట్ ప్రకటించానని నా స్నేహితులు ఫోన్ చేసి మరీ అభినందించడం చాలా ఆశ్యర్యానికి గురిచేసింది` అంటూ తాజాగా ఆయన ట్వీట్ చేశాడు.
అయితే రాహుల్ కేవలం సరదా కోసమే ఇలా చేసినా.. ఈ విషయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రాహుల్ ఏకేస్తున్నారు. కాగా, తెలంగాణలో జన్మించిన రాహుల్ రామకృష్ణ మెకానికల్ ఇంజరీనింగ్ చదువుకుని.. ఆపై సినిమాల మీద ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.
`సైన్మా` అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మారిన ఈయన.. `జయమ్ము నిశ్చయమ్మురా` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, హుషారు, భరత్ అను నేను, బ్రోచేవారెవరురా ఇలా వరుస సినిమాలు చేసి.. తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆర్ఆర్ఆర్, విరాట పర్వంతో సహా మరిన్ని సినిమాలు చేస్తున్నాడు.
It’s a joke you fools
Why would I throw away a high paying, luxury life so full of benefits? I can’t believe my friends are calling me up to congratulate me on my retirement 😆— Rahul Ramakrishna (@eyrahul) February 5, 2022
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!