హీరో నుండి ర‌చ‌యిత‌గా…


ఫెయిల్యూర్ చాలా గొప్ప‌ది.. ఎందుకో తెలుసా.. స‌క్సెస్ విలువేంటో చెప్పేది అదే కాబ‌ట్టి. ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు స‌క్సెస్ గొప్ప‌త‌నం.. దానికి ఉన్న విలువేంటో అర్థ‌మ‌వుతుంది. డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాపుల‌ను సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఒక హిట్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో కిషోర్ తిరుమ‌ల‌తో చేసిన `చిత్ర‌ల‌హ‌రి`.. ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా న‌టించిన సాయిధ‌ర‌మ్ ఇప్పుడు రైట‌ర్‌గా అవ‌తారం ఎత్తాడ‌ట‌. ఓ క‌థ‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడ‌ట‌. బేసిక్ క‌థ సిద్ధ‌మైంది. త‌న టీంతో పూర్తి స్థాయి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాట్ట ఈ హీరో. ఓ యువ ద‌ర్శ‌కుడిని ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో తేజు బిజీగా ఉన్నాడని సినీ వ‌ర్గాల క‌థ‌నం. మ‌రి ర‌చ‌యిత‌, హీరోగా తేజు ఏ మేర విజ‌యాన్ని అందుకుంటాడో చూద్దాం..