Prabhas – Maruthi: ఆదిపురుష్, ప్రాజెక్ట్ కంటే భారీ ప్లాన్ చేసిన యూవీ క్రియేషన్స్..షూటింగ్ మొత్తం ఒక్క చోటే ప్లాన్ వేసినట్టు తాజా సమాచారం. అది మారుతి దర్శకత్వంలో రూపొందబోయో సినిమా. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాన్ని చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణ్ హీరోయిన్గా.. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ – బిగ్ బీ ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్దమవుతోంది.
ఈ ఏడాది మార్చి 11 వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ దీనికి దర్శకత్వం వహించగా, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాగా, ఈ మూవీ హిందీ వెర్షన్‌కు అమితాబ్ వాయిస్ ఓవర్, మిగతా భాషలకు సౌత్ స్టార్స్ అందిస్తుండటం విశేషం. ఇక ఆదిపురుష్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుండగా, సలార్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అలాగే, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబోలో సినిమా ఈ ఏడాది మొదలవనుంది.
Prabhas – Maruthi: ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే గొప్పగా..
ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం అత్యంత భారీ సెట్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ సెట్స్‌లోనే ప్రభాస్ – మారుతి సినిమా షూటింగ్ మొదలవబోతుందట. ఇక త్వరలోనే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి..రెగ్యులర్ షూటింగ్ అలాగే, ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సెట్స్ మొత్తం ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే గొప్పగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.