బిగ్ బాస్ 13 రియాల్టీ షోలో షెహ్నాజ్ గిల్ -సిద్ధార్థ శుక్ల ఆ సీజన్ కి పాపులర్ కపుల్స్ గా అప్పట్లో వార్తల్లో నిలిచారు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని అదే రిలేషన్ ని మెయింటెన్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలు
నెటిజన్లకు, అభిమానులకూ పంచుకుంటూ చురుగ్గా ఉంటున్నారు. అయితే తాజాగా ఇటీవల ఈ ఇద్దరు కలసి ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో లైవ్ లో ముచ్చటించారు.ఈ సందర్భంగా సిద్ నాజ్ కు ఉన్న అభిమానుల గురించి చర్చ జరిగిన టైంలో… విద్వేషాలను రెచ్చగొట్టే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని అలాంటి వారిని పక్కన పెట్టాలని అభిమానులతో చేసిన చాట్ లో సిద్ధార్థ పేర్కొన్నారు.
దీంతో పక్కనే ఉన్న షేహా నాజ్ వెంటనే సిద్ధార్థ చెంప చెల్లుమనిపించింది.సీరియస్ గా కాకుండా కామెడీ తరహాలోనే షేహనజ్ ఈ విధంగా వ్యవహరించి ట్రోల్స్ పై మీరు కూడా ఇలానే చెయ్యండి అంటూ…. అభిమానులకు మరియు ఫాలోవర్ లకు కామెడీ గా సూచించింది. ఇదిలా ఉండగా ఈ జంట ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న…. సిద్ధార్థ మాత్రం తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప వేరే రిలేషన్ లేదని చెప్పుకొస్తున్నాడు.
https://www.instagram.com/p/CDXxXUhl1Vr/?utm_source=ig_web_copy_link