RRR: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వర్సెస్ మెగా వార్ నువ్వానేనా అన్నట్టుగా ఉండేది. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి అంటే ఎంత వాతావరణం కనిపించేది. ఇద్దరు హీరోల అభిమానులు పోటాపోటీగా కటౌట్లు కట్టడం… సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో అయితే థియేటర్ లో చాక్లెట్లు పాప్కాన్ కూడా.. పంచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ హీరోల అభిమానుల మధ్య.. మొన్నటిదాకా వాతావరణం ఉంటే తాజాగా.. నందమూరి మెగా అభిమానులకు కలిసిపోయి ఒకరినొకరు పడుకునే రీతిలోకి వచ్చారు. దానికి కారణం “RRR”.
కాగా ఈ సినిమా ఇప్పుడు మార్చి 25 వ తారీకు విడుదల అవుతున్న నేపథ్యంలో… సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా భారీ ఖర్చు లేకుండా ఇంటర్వ్యూల తో చరణ్, తారక్, రాజమౌళి కానిచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి… ఈ ముగ్గురితో ఇటీవల ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి ఇంకా అనేక విషయాల గురించి పర్సనల్ లైఫ్ గురించి అనిల్ రావిపూడి తనదైనశైలిలో ప్రశ్నలు వేశారు.
ఇంటర్వ్యూలో చరణ్ బర్త్ డే నాడు..తన వైఫ్ ప్రణతి చరణ్ కి ఇచ్చే సర్ప్రైస్ గురించి తారక్ కొత్త విషయాన్ని బయట పెట్టాడు. మేటర్ లోకి వెళ్తే ప్రణతి పుట్టిన రోజు మార్చి 26. ఇక చరణ్ పుట్టిన రోజు మార్చి 27 ఈ క్రమంలో తన పుట్టినరోజు అయిపోయిన అర్ధరాత్రి పన్నెండు దాటిన వెంటనే పక్కనే చరణ్ హౌస్ దగ్గరికి కారు లోకి వెళ్లి మొదటి విశేష్ చెర్రీకి తెలియజేసేది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ పక్కనే చరణ్ ఉండటంతో అవును ప్రతియేటా ప్రణతి ఖచ్చితంగా తన కారుతో మా ఇంటికి వచ్చేది నేను.. డోర్ దగ్గర ఉండే వాడిని ఫస్ట్ విశేష్ ఆమె చేసేది.. రెండు కుటుంబాల మధ్య మంచి పని ఉంది అని ఎన్టీఆర్, చరణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.