Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” త్వరలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ బొమ్మ వెండితెరపై కనపడక పోవటంతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాతో దాహం తీర్చుకోవడానికి మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్నపాటి వీడియో అదేవిధంగా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు కూడా అంగరంగ వైభవంగా భారతీయ చలన చిత్ర రంగం లో ఏ సినిమా కి జరగని విధంగా జరిగే లాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు రెండు కోట్లకు పైగానే ఖర్చు చేయటానికి ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ నగరం యూసఫ్ గూడా గ్రౌండ్ లో జరగబోయే ఈ వేడుకకు సినిమా యూనిట్ తప్ప మరెవరూ వచ్చే అవకాశం ఉండదని… కుదిరితే రామ్ చరణ్, చిరంజీవి మినహా మరెవరూ రారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చే బుధవారం అనగా మార్చి 24 వ తారీకు సాయంత్రం ఐదున్నర గంటలకు మొదట సినిమా థియేటర్లలో ఆ తర్వాత ఆరున్నర గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ కాబోతుందట.
తాజాగా ఈ వార్త సినిమా యూనిట్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు .. చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లు, చాలా బాగుంది అనే టాక్ సినిమా యూనిట్ నుండి అందుతుంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది మే 15 వ తారీఖున రిలీజ్ కావాల్సింది. మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడం తో … సినిమా ఇండస్ట్రీలో లాక్డౌన్ దెబ్బకు .. థియేటర్లు క్లోజ్ అవడంతో… ఏప్రిల్ నెల 9వ తారీఖున రిలీజ్ కానుంది.