డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం “లైగర్” ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌తో పాటు ముంబైలో రెండు చోట్ల ఘనంగా నిర్వహించడం జరిగింది. సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఇంకా చాయ్ వాలా కుర్రాడిగా.. కనిపిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా… “లైగర్” లో కీలక పాత్ర పోషించడం జరిగింది. రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముంబాయి బాంద్రా ప్రాంతంలో.. స్థానిక పిల్లలతో కలిసి హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ అనన్య పాండే డాన్సులు వేస్తూ ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ కూడా ముంబై వీధులలో సందడి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు ఉదయం “లైగర్” నుంచి waat laaga denge పేరుతో ఆటిట్యూడ్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. సాంగ్ తరహాలో వచ్చిన ఈ పాటని పూరి జగన్నాథ్ రాయగ… విజయ్ దేవరకొండ స్వరమందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా నిలిచింది.
ఇప్పటికే “లైగర్” ట్రైలర్ లు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తున్నాయి. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు సైతం డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తమ అభిమాన హీరోని మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఏక్కిస్తాడని బలంగా నమ్ముతున్నారు. గతంలో పూర్తి పరాజయాలలో నిండిపోయిన ఎనర్జిటిక్ హీరో రామ్ నీ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి లైఫ్ ఇవ్వటం జరిగింది. “లైగర్” తో విజయం అందిస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.