NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 25th శుక్రవారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 25 – శుక్రవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శుక్రవారం, తిథి: ఏకాదశి రాత్రి 1.54 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: అశ్విని ఉదయం 7.36 వరకు ఉపరి భరణి, వర్జ్యం: సాయంత్రం 6.24 నుండి రాత్రి 8.12 వరకు, అమృత ఘడియలు: రాత్రి తెల్లవారు జాము 5.11 నుండి మర్నాటి ఉదయం 6.59 వరకు, రాహుకాలం: ఉదయం 10.53 నుండి పగలు 12.16 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.57 నుండి 9.41 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.38 నుండి 1.22 వరకు. గీతా జయంతి. ముక్కోటి ఏకాదశి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ఈరోజు ఆదాయం తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం చేయకండి. ఈరోజు మీ మీద నరగోష ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీకు సహాయం చేసే వారిని ఏమనకుండా ఉండడం మంచిది. ఈరోజు కొత్త వ్యక్తులను నమ్మకండి. ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఏ వస్తువులను కొనడం, అమ్మడం చేయకుండా ఉండటం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. బంధువులతో వాదోపవాదాలు పెట్టుకోకండి అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు స్నేహితులకు దూరంగా ఉండండి.

రెమిడీ: దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఇబ్బందుల నుంచి బయట పడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిని శ్రద్ధగా చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకుముందు ఉన్న ఇబ్బందుల నుంచి ఈరోజు బయట పడతారు. ఈరోజు పెద్దల మాటలను గౌరవిస్తారు. ఈరోజు డబ్బులను వృధా చేయకుండా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు విలువనిస్తారు. విద్యార్థులు ఈరోజు కష్టపడి చదువుకొని క్రొత్త విషయాలను తెలుసుకుంటారు, ఏ విషయాన్నైనా తొందరగా అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు అనవసరమైన విషయాలను మాట్లాడకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఓర్పుగా, సహనంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు స్త్రీలు ఆరోగ్యంగా , మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారస్థులకు వృత్తి పరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు అన్నపూర్ణ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు కోపాన్ని తొందరపాటు తనాన్ని రానివ్వకండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. ఈరోజు ఎవరితో వితండ వాదాలు చేయకుండా ఉండండి. ఈరోజు నలుగురితో కలిసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి ని పెట్టడం మంచిది. చెడు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు అధిక శ్రమ లాభం తక్కువ.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఎదుటి వారితో సన్నిహితంగా ఉంటారు, ఎదుటివారి సలహాలను పాటిస్తారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈరోజు సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు పుస్తకాలను చదివే అలవాటుగా ఉంచుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకుంటే ఇతరులకు చెప్పకుండా రహస్యంగా ఉంచడం మంచిది. ఈరోజు మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. దానధర్మాలు చేస్తారు. ఈరోజు అందరితో సఖ్యత గా ఉంటారు. ఈరోజు మూగజీవుల మీద మమకారం చూపుతారు. ఈరోజు ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. ఈరోజు ప్రకృతిని ఇష్టపడతారు. విహార యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్రం , అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి : ఈరోజు పనులు ఆలస్యంగా అవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వాదనలు చేసే వారితో దూరంగా ఉండండి. ఈరోజు సమయానికి నిద్ర హారాలు తీసుకోండి లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. ఈరోజు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో కొంచెం నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు పనులు కొంచెం ఆలస్యంగా అవుతాయి. ఈరోజు ఏ పని కైనా ఇతరుల మీద ఆధారపడకుండా మీరే చేసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలను ఆలోచించకుండా మనసును నెమ్మదిగా ఉంచుకోండి. విద్యార్థులు చదువుమీద దృష్టిని కేంద్రీకరించండి, అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.

రెమిడీ: ఈరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని పని పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ సంపద పెరుగుతుంది. ఈరోజు ఏదైనా శుభకార్యం చేసే అవకాశం ఉంది. ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు. ఈరోజు భార్యాభర్తల సఖ్యత గా ఉంటారు. ఈరోజు గోసేవ చేయాలనుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు అనేక సమస్యలు పరిష్కారం. ఈరోజు బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు గురు, దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

తులారాశి : క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతారు!

ఈరోజు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఆచార సంప్రదాయాలను మానేయకుండా వాటిని పాటించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయానికి నిద్ర ఆహారాలను మానకండి. ఈరోజు పెద్ద వారి మాటలను గౌరవించండి లేదంటే అభిప్రాయబేధాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పనులను వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. రోజు సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి కష్టపడతారు. ఈరోజు గొడవలకు తగాదాలకు దూరంగా ఉండండి లేదంటే ప్రశాంతత కోల్పోతారు. ఈరోజు తొందరగా డబ్బు సంపాదించాలని తప్పు చేసే అవకాశం ఉండి. ఈరోజు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది లేదంటే సమాజంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగ పరచుకుని చదువు మీద దృష్టిని కేంద్రీకరించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉండి.

రెమిడీ: ఈరోజు గురుపాదుక స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు దైవ కార్యక్రమంలో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆచార సాంప్రదాయాల మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఏ పనైనా సంతోషంగా చేస్తారు. ఈరోజు దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు నిజాయితీగా, ధర్మంగా ఉంటారు. ఈరోజు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఈరోజు స్నేహితులకు మీకు మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఈరోజు కుటుంబసభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  ఈరోజు అప్పులను తీర్చుకుంటారు. ఈరోజు క్రయవిక్రయాలకు మంచి రోజు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : ఈరోజు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది !

ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అప్పుల బాధలు కలుగుతాయి. ఈరోజు మీ మీద నిందారోపణలు వచ్చే అవకాశం ఉండి. ఈరోజు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఈరోజు వాహన ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తొందరగా ఎవ్వరిని నమ్మకండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు స్నేహితులకు దూరంగా ఉండండి, మిత్రద్రోహం ఏర్పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోండి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి.

రెమిడీ:ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి : ఈరోజు ఉద్యోగ అవకాశం కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఈరోజు మీ పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అందరితో సఖ్యతగా ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు ఏ విషయం అయినా సులువుగా అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

రెమిడీ: విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి : నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈరోజు నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సమయానికి డబ్బులు చేతికి అందక పోవచ్చు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు వాదోపవాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాల్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు తక్కువ మాట్లాడడం మంచిది. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు మీరు చేయని తపూకి నిండా పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఇతరుల దోషాలను ఎత్తిచూపడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో ఈర్ష్య ద్వేషాలతో ఉండకుండా సఖ్యతగా ఉండండి. ఈరోజు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన మానుకోండి, దాని వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు పెద్ద వారి సూచనలను మాటలను గౌరవించండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి శుభం జరుగుతుంది.

 

మీన రాశి : భవిష్యత్ గురించి ఆలోచిస్తారు !

ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.ఈరోజు పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు.ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను అనుసరించి కష్టపడి చదువుకుంటారు. ఈరోజు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు.ఈరోజు మీ పని మీరే సొంతంగా పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు. స్త్రీలు ఈరోజు మానసిక వేదన తగ్గించుకొని అందరితో సంతోషంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?