NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 27th ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ – 27 – ఆదివారం. 27.12.2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ఆదివారం, తిథి: త్రయోదశి రాత్రి తెల్లవారు జాము 6.20 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: కృత్తిక పగలు 1.19 వరకు తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, అమృత ఘడియలు: ఉదయం 10.39 నుండి పగలు 12.25 వరకు, రాహుకాలం: పగలు 4.26 నుండి సాయంత్రం 5.49 వరకు, దుర్ముహూర్తం: పగలు 4.20 నుండి సాయంత్రం 5.04 వరకు.

today december 27th daily horoscope in telugu
today december 27th daily horoscope in telugu

మేష రాశి డిసెంబర్ – 27 – ఆదివారం: ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది !

ఈరోజు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక చిరాకు పడతారు. ఈరోజు ఖర్చులు ఎక్కువ పెడతారు. ఈరోజు ఎవరితో గొడవలు, వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈరోజు దూరప్రయాణాలు చేసి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఈరోజు మొండి బకాయిలు వసూలు కాకపోవడం వల్ల బాధకు లోనవుతారు. ఈరోజు ఏదైనా విషయం కోసం దీర్ఘాలోచన చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి అంటా శుభప్రదం.

 

వృషభ రాశి డిసెంబర్ – 27 – ఆదివారం: ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. ఎంతటి కష్టాన్ని అయినా సులువుగా పూర్తి చేస్తారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు, ఏదైనా అనారోగ్యం ఉన్నా దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్త్రీలు ఈరోజు అందరితో సన్నిహితంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే పని మీద మంచి శ్రద్ధ పెట్టి పని పూర్తి చేస్తారు. ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు చదువు మీద మంచి ఏకాగ్రతను చూపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు లలితా అష్టోత్తరం , లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి డిసెంబర్ – 27 – ఆదివారం : పనులను వాయిదా వేస్తారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయకుండా వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, ఒకవేళ ప్రయాణం చేసిన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వారితో పరిచయాలు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈరోజు అనవసర ఖర్చు పెట్టకుండా ఉంటే మంచిది. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబంది. విద్యార్థులు ఈరోజు విద్య మీద శ్రద్ధ చూపించండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది.

 

కర్కాటక రాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అందరితో గౌరవమర్యాదలు తీసుకుంటారు. ఈరోజు ఏ పనిలో అయినా ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. అందరితో చక్కగా ఉంటారు. ఈరోజు మీకున్న తెలివితో వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు స్త్రీలు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు సహనంతో ఏ విషయంలో నైనా విజయం పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంది !

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది, లేదంటే ఎవరితో అయినా వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీ మొండి పట్టుదల వల్ల మంచి వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ఈరోజు సంపద తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో రుణబాధలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు మీద శ్రద్ధ చూపండి.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి అంతా బాగుంటుంది.

కన్యారాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు !

ఈరోజు బాగుంటుంది. ఏ పనికైనా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈరోజంతా నీతి, నిజాయితీ, ధర్మంగా ఉంటారు. ఈరోజు అందరూ మిమ్మల్ని పొగుడుతారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. సంపాదన విషయంలో బాగుంటుంది. విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకుంటారు. పెద్దల మాటలను గౌరవిస్తారు, పాటిస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు గాయత్రి కవచం పారాయణం చేసుకోండి.

తులారాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది !

ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు నిరుత్సాహంగా కనిపిస్తారు. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు అనుకున్న పని చేయలేదని మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో ధన నష్టం కలుగుతుంది. ఈరోజు అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోకపోవడం మంచిది ఈరోజు గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ పెట్టండి.

రెమిడీ: ఈరోజు మహిషాసురమర్దిని స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి డిసెంబర్ – 27 – ఆదివారం: ఈరోజు దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఇంతకు ముందు కంటే ఈరోజు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా ఉంటారు. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. ఈరోజు రుణ బాధలు తీరిపోతాయి, అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు మంచి దైవభక్తి, ఆద్యాత్మికచింతనా ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పై అధికారులతో మెప్పు పొందుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు వ్యాపారస్తులకు అధిక ధన ప్రాప్తి కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణాన్ని చేసుకోండి.

 

ధనస్సు రాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు వ్యాపారంలో నష్టం !

ఈరోజు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనుకున్న పని తొందరగా అవ్వక మానసిక వత్తిడికి గురవుతారు. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. ఖర్చు అధికమవడం వల్ల ఇబ్బంది పడతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత పెట్టడం, స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారం లో అనుకున్న లాభాలు రాకపోవడంతో నష్టం కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం, శివపంచాక్షరీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు  పెట్టుబడులు పెడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొండితనంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు సొంత ఆలోచనలు చేసుకుని పనులు చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సరైన సమయంలో తీసుకుంటారు. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు పెద్దవారికి సేవ చేస్తారు, పెద్దవారిని గౌరవిస్తారు. ఈరోజు వ్యాపారస్తులు దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెడతారు. ఈరోజు క్రొత విషయాలను నేర్చుకుంటారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలి అని అనుకుంటారు. ఉద్యోగస్తులు ఈరోజు చురుగ్గా పని చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో ఉన్నత శ్రేణి పొందుతారు.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం, సుందరాకాండ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు భార్యాభర్తల మధ్య కలహాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో వాళ్లు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేక శత్రువులు గా మారుతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది, అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు రాబడి తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది. వాదోపవాదాలకు, గొడవలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. క్రొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండడం మంచిది. ఈరోజు ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు.

రెమిడీ: ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి డిసెంబర్ – 27 – ఆదివారం : ఈరోజు సంగీతం మీద శ్రద్ధ చూపుతారు !

ఈరోజు ప్రతి పనిని తెలివిగా పూర్తి చేస్తారు. ఈరోజు మీరు అనుకున్న దానిని సాధించుకుంటారు. ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు ప్రకృతిని ఇష్టపడతారు. ఈరోజు సంగీతం మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ప్రతి పనిని సంతోషంగా, ఉత్సాహంగా చేస్తారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. ఈరోజు పెద్దవారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. ఈరోజు ఉద్యోగంలో ఇబ్బందులు తగుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. వ్యాపారస్తులకు ఈరోజు రుణ వేదన తగ్గుతుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?