NewsOrbit
5th ఎస్టేట్

హైదరాబాద్ అల్లాడిపోతోంది… పట్టించుకోవా కే‌సి‌ఆర్?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కరోనా కేసులు తో రోజురోజుకూ అల్లాడిపోతుంది. ఇప్పటికే రోజూ సగటున 800కు పైగా కరోనా కేసులు ఒక్క నగరంలోనే నమోదు అవుతుండటం గమనార్హం. అంతేకాకుండా మధ్య కాలంలో చేసిన టెస్తూల్లో 50 శాతం కి పైగా పాజిటివ్ కేసులు రావడం చూస్తుంటే వైరస్ ఎంత భారీగా నగరంలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో దాదాపు 90 శాతం కేసులు ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. సామాన్యులతో పాటు రాజకీయ నేతలు కూడా వ్యాధి బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 

Central team visits Hyderabad to review Corona situation

అయితే కేసీఆర్ మొదటి నుంచి కరోనా  విషయమై నిర్లక్ష్య ధోరణిని వ్యవహరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఐసీఎంఆర్ గైష్ లైన్స్ ప్రకారం టెస్టులు జరుపుతున్నామని చెప్పిన కేసీఆర్ కు హైకోర్టు విపరీతమైన చివాట్లు పెట్టిన తర్వాత రాష్ట్రంలో కొంచెం ఎక్కువ మొత్తంలో టెస్టింగ్ జరిపారు. అయితే అవి కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. ఉదాహరణకు తెలంగాణలో అత్యధికంగా ఇప్పటివరకు రోజుకి ఐదు వేల టెస్టులు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రోజుకి ఇరవై వేల టెస్టులను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంది.

ఇక అలాంటి ఆంధ్రప్రదేశ్ లోనే కరోనా వ్యాధి తగ్గడం లేదు అంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఎలాఉండబోతోందో  మనం అర్థం చేసుకోవచ్చు. మొదట తబ్లిజి జమాత్ ప్రార్థనల నుంచి వైరస్ నగరవ్యాప్తంగా వేగంగా విస్తరించింది. అనేక రాష్ట్రాల నుంచి కూడా అధిక మొత్తంలో వైరస్ బాధితులు హైదరాబాద్ కు తరలి వచ్చారు. 60 రోజుల పాటు లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో కేసుల సంఖ్య తగ్గింది కానీ తర్వాత రోజు రోజుకి రెట్టింపు అవ్వడం తప్పించి ఎక్కడా కొద్దిగా కూడా మెరుగైన ఫలితం అయితే కనబడలేదు.

ఇక గత వారం చివరిలో రెండురోజులు కరోనా టెస్టింగ్ ను ఆపి వేయడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టే విషయం. అధిక స్థాయిలో టెస్టులు నిర్వహించాలని తెలిసినప్పుడు ఎక్కువమంది ల్యాబ్ సిబ్బందిని తీసుకోకుండా చివరికి మిగిలిపోయిన శాంపిల్ ను టెస్ట్ చేసేందుకే సమయం సరిపోకపోవడంతో ప్రభుత్వం రెండు రోజులపాటు టెస్టింగ్ నిలిపివేసింది. అయితే హైకోర్టు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి వరుస హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు కేసీఆర్ మరో నాలుగు రోజుల పాటు కరోనా నిర్థారణ పరీక్షలను నిలిపివేయవలసి ఉందిగా ప్రైవేట్ ల్యాబ్ కు ఆదేశాలు జారీ చేయడం వెనక ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇక పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు కూడా లేరు .కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆసుపత్రిలో బెడ్స్ కూడా లభించడం లేదు. అలాగే పరీక్షల రిపోర్టుల్లో అవకతవకలు జరుగుతున్నాయని అభియోగాలు ఎక్కువ రావడం మరియు చాలామంది విషమంగా ఉన్న పేషెంట్లకు డాక్టర్లు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని మెరుగైన వైద్య సేవలు లభించడం లేదని…. వెంటిలేటర్ల కొరత ఉందని చనిపోయే చివరి క్షణాల ముందు సెల్ఫీ వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి మరీ ప్రజలు ప్రాణాలు వదులుతుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తుందా లేదా అన్న సందేహాలను తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మరి కరోనా విలయతాండవం హైదరాబాస్ లో ఇప్పట్లో తగ్గేలా కనిపించకపోవడంతో కెసిఆర్ తక్షణమే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోకపోతే తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు అతను బాధ్యత వహించక తప్పదు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau