Mallik Paruchuri: మల్లిక్ పరుచూరి – మెడికల్, మీడియా మాఫియాలో ఒక బంధీ..! బాధ్యులెవరు – బాధితులెవరు..!?

Mallik Paruchuri: Both Mafia Management in
Share

Mallik Paruchuri: మన దేశంలో కొన్ని చట్టాలున్నాయి.. రూపాయికి మోసం చేసినా 420 సెక్షనే.. కోటి రూపాయలకు మోసం చేసినా 420 సెక్షనే ఉంటుంది.. వాడికీ, వీడికీ ఒకే తరహా శిక్ష పడుతుంది..! మరి ఇదే లెక్కన…

ఒక దోమ జీవిత చరిత్ర మొత్తం పాఠాల్లో నేర్చుకుంటాం. లార్వాల ఉత్పత్తి, పెరుగుదల, దోమల పుట్టుక, వాటి విస్తరణ కూడా బడి పాఠాల్లో నేర్చుకున్నాం.. దోమ కుడితే మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులతో పాటూ డెంగీ వంటి ప్రాణాంతక మందులేని వ్యాధి కూడా సోకుతుంది.. డెంగీ అంటువ్యాధి కాకపోవచ్చు కానీ మందులేదు, కరోనా కంటే ప్రాణాంతకమైనది.. దీని గురించి అభ్యసించి, అధ్యయనం చేసి.. దోమల రకాలు, డెంగీ వైరస్ లో రకాలు, లక్షణాలు, చేసే నష్టం గురించి వివరిస్తే తప్పు లేనప్పుడు… కరోనా వైరస్ లో తర్వాత దశలు, దాని వలన నష్టం, ఎదురయ్యే ఇబ్బందులు, మన వ్యవస్థ చేస్తున్న తప్పులు చర్చిస్తే తప్పు అయిందా..!? అందుకే పరుచూరి మల్లిక్ పై కేసు నమోదు చేసారా..!?

Mallik Paruchuri: Both Mafia Management in
Mallik Paruchuri: Both Mafia Management in

Mallik Paruchuri: మల్లిక్ ఏం చెప్పారు..!?

మల్లిక్ పరుచూరి ఒక కెమికల్ ఇంజినీర్. రసాయనాలు, మెడిసిన్స్ పై సొంతంగా కొన్ని అధ్యయనాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులు.. వైద్యులు చేస్తున్న తప్పులు.., ఈ తప్పుడు విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. “మానవ శరీరంలోకి 5, లేదా 10 ఎంజీ కంటే ఎక్కువ స్టెరాయిడ్స్ వెళ్ళకూడదు.. కానీ కరోనా రెండో దశ పీక్స్ లో ఉన్నప్పుడు 500, 1000 ఎంజీ కూడా వేశారు. ఇది తప్పు, అందుకే మరణాలు అనేది ఆయన వాదన”..! “కరోనా వలన ఇన్ని మరణాలకు కారణాలు తెలుసుకుని, అధ్యయనం చేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు”..! “రెమెడీస్వేర్ వాడడం తప్పు.. అది వైరస్ ని చంపదు.. సంతానోత్పత్తిని తగ్గించే ఒక మందు అని ముందే చెప్పారు. కానీ మొదట్లో పట్టించుకోలేదు. విపరీతంగా వాడేశారు. చివరికి భారతీయ వైద్య పరిశోధన మండలి అదే చెప్పింది. రెమెడీస్వీర్ ఆపేయాలని సూచించింది”..! “కరోనా లాక్ డౌన్ వలన తగ్గదు.. లాక్ డౌన్ విధానం ఇది కాదు. అది మానవ శరీరంలోని కాణాల్లోకి వెళ్తుంది. ఆ కణాలను గుర్తించి అదుపు చేయగలిగితే ఫలితం ఉంటుందని చెప్పారు. మూడో దశ మరింత తీవ్రంగా ఉండనుంది.. ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.. మెంతులు వంటి సాధారణ ఇంటి ఔషధాలను సూచించారు. అతని విషయాలను ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు.., నేర్చుకోవడం ఆరంభ దశలో ఉన్నప్పుడే కొందరు పెద్దలకు, ప్రభుత్వాలకు, మెడికల్ మాఫియాకి మండింది. మల్లిక్ పై కేసు నమోదయింది. అతని వాట్సాప్ నంబర్ బ్లాక్ అయింది. అతనికి థ్రెట్ ఏర్పడింది. తన రక్షణ, తన హక్కుల కోసం దీక్షకు కూర్చునే వరకు దారి తీసింది..

Mallik Paruchuri: Both Mafia Management in
Mallik Paruchuri: Both Mafia Management in

మెడికల్ మాఫియా చేతిలో బందీలేనా..!?

సాధారణంగా మన భారతీయ వైద్య విధానంలో మెడికల్, ఫార్మా కంపెనీల మాఫియా అతి పెద్దది. లక్షల కోట్లలో నల్లధనం చేతులు మారుతుంది. అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.. నిజానికి మనం నిత్యం వాడే పేరాసిటిమాల్ మాత్రా తయారీకి పది పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ దానికి లాభం, డాక్టర్ కమీషన్, రిప్రెజెంటేటివ్ కమీషన్, ఇతర అన్నీ చూసుకుని రూపాయికి అమ్ముతుంటారు. అలాగే ప్రతీ టాబ్లెట్ పై ఫార్మా కంపెనీలకు కనీసం 30 శాతం లాభం ఉంటుంది. వైద్యులకు కనీసం 20 శాతం ఉంటుంది.
* ప్రతీ మనిషికి ఆరోగ్యం అంటే భయం. కొంచెం సుస్తీ చేసినా త్వరగా తగ్గాలి అనే ఆందోళనలో జనం ఉంటారు. సో.., ఇదే మెడికల్, ఫార్మా కంపెనీలకు ఆయుధంగా మారుతుంది. ధర లెక్క చేయకుండా పేద, ధనిక తేడా లేకుండా మందులు కొనుక్కుని వాడతారు. బహుశా మన దేశంలో అసలు బేరం ఆడకుండా తీసుకెళ్ళేది మందులు(ఫార్మా) / మందు (మద్యం) మాత్రమే. అందుకే ఆ రెండు లక్షల కోట్ల వ్యాపారంతో విరాజిల్లుతున్నాయి. అటువంటి మెడికల్ మాఫియా తప్పులను మల్లిక్ ఎత్తి చూపారు. ఆ విధానాన్ని ప్రశ్నించారు. మందులు వాడుతున్న వైఖరిని తప్పు పడుతూ లోపాలను స్పష్టంగా చెప్పారు.
* వైద్య పట్టా లేకుండా, గుర్తింపు లేకుండా వైద్యం చేయడం తప్పు. కానీ వైద్యం తీరుని నేర్చుకోవడం, అభ్యసించడం తప్పు కాదు. నేర్చుకోవడం, నేర్పించడం తప్పు కాదు. తనకు తెలిసిందే, తాను నేర్చుకున్నదే సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పాలనుకున్నారు మల్లిక్. అది వ్యవస్థకి నచ్చలేదు. కేసులు పెట్టింది, ఇరికించింది.

Mallik Paruchuri: Both Mafia Management in
Mallik Paruchuri: Both Mafia Management in

మీడియా మాఫియా పాత్ర స్పష్టం..!!

మనకు కనిపించని నాలుగో సింహం పోలీస్ అన్నట్టు… వ్యవస్థాగత అవినీతిలో బయటకు తెలియని అతి పెద్ద అవినీతి వ్యవస్థ మీడియాదే. వార్తల పేరుతో వ్యాపారం చేసే సంస్థలు కోకొల్లలు. టీవీ 5 న్యూజెన్ ఆయిల్ దగ్గర నుండి.., ఎన్టీవీ భూ కుంభకోణాలు.. టీవీ 9 రాజకీయ పార్టీలతో బహిరంగ బేరాలు.. ఏబీఎన్, ఈటివి బ్లాక్ మెయిలింగ్ వార్తలు… ఇలా ఒక్కో ఛానెల్ దీ ఒక్కో కథ. ఇవేమి బయటకు రావు. రానీయరు. ఇటువంటి మీడియా మెడికల్/ ఫార్మా మాఫియాతో కూడా కలిసే ఉంటుంది. కార్పొరేట్ శక్తుల చేతిలో బంధీగానే ఉంటుంది. అందుకే ఈ మల్లిక్ పరుచూరి వ్యవహారాన్ని కూడా ప్రధాన మీడియా పెద్దగా చూపించదు. ఆయన చెప్తున్నా అంశాలను పట్టించుకోదు. ఒక వ్యక్తి తన హక్కుల కోసం, రక్షణ కోసం దీక్ష చేస్తున్నప్పటికీ ఏ మీడియా చూపించకపోవడానికి ఇదే కారణం..! మల్లిక్ కాకుండా ఏ అనామకుడో అకారణంగా దీక్ష చేస్తున్నా మీడియా పదే పదే చూపిస్తుంది. కానీ మల్లిక్ చెప్తున్న లాజిక్కులు, వ్యవస్థల లోపాలు బయటకు తెలియకూడదనే అంతర్గత ఉద్దేశంతో మీడియా మల్లిక్ విషయాలను నొక్కిపెడుతుంది.


Share

Related posts

Jamili Elections ; బీజేపీ మాట నెగ్గుతున్నట్టే..! 2022లోనే ఎన్నికలు – జమిలికి మొత్తం ప్లాన్ సిద్ధం..!?

Srinivas Manem

హిందుత్వానికి హిందుత్వమే మందు : జగన్ సూపర్ స్కెచ్!!

Comrade CHE

ఏపీ ప్రజలు డైరెక్ట్ గా ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు .. ఖచ్చితంగా షేర్ చేయండి !

sridhar