NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MK Stalin: నాడు మహిళా జర్నలిస్టుపై రేప్ – నేరారోపణలు..? నేడు ఉత్తమ సీఎం..! మార్పు నిజమా? నటనా..!?

MK Stalin: Notorious Turned as Best CM.. Interesting Facts

MK Stalin: ఎంకే (ముత్తువేల్ కరుణానిధి) స్టాలిన్.. ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగిపోతోంది.. దేశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహారం మొత్తం దేశ రాజకీయాల్లో కొత్త పంథా చాటుతుంది.. నాలుగు నెలల కిందట తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ లో ఇంతటి ప్రభావిత నిర్ణయాలు, ఇంతటి ఆదర్శనీయ రాజకీయాలు ఎవ్వరూ ఊహించలేదు. ఈయన నిర్ణయాలతో దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నేతలు, అక్కడి ప్రతిపక్ష నేతలు, ఆయన ప్రత్యర్దులు కూడా ముక్కున వేలేసుకుని మౌనంగా ఉండాల్సి వస్తుంది..! ఇప్పుడున్నది నిజమైన స్టాలిన్ యేనా..? నిజ స్వరూపాన్ని దాచిపెట్టి స్టాలిన్ నటిస్తున్నారా..? ఆయన నైజం అంతేనా..!? స్టాలిన్ మారిపోయారా..!? మారినట్టు నటిస్తున్నారా..!? అసలు స్టాలిన్ పూర్వపు చరిత్ర ఏమిటి..? ఆయనపై ఉన్న దారుణమైన కేసులు, ఈ మార్పు వెనుక కారణాలు అన్నీ ఈ కథనంలో లోతుగా చూద్దాం..!!

MK Stalin: ఒరిజినల్ కానే కాదు..!!

ఇప్పుడున్నది ఒరిజినల్ స్టాలిన్ కానే కాదు. నాటి స్టాలిన్ వేరు. ఎప్పుడో 1953లో జన్మించిన స్టాలిన్ వయసు ఇప్పుడు 68.. ఈ వయసులో సీఎం అయిన స్టాలిన్ గత చరిత్రలో అనేక నేరాలున్నాయి. ఒక మహిళా జర్నలిస్టుపై అత్యాచారం చేశారనే నేరారోపణ ఉంది. తమిళనాడులో టీవీ యాంకర్ గా పనిచేసిన ఫాతిమా బాబు అనే జర్నలిస్టుపై అత్యాచారం చేశారన్న అభియోగం స్టాలిన్ పై ఉంది. దాదాపు 35 ఏళ్ళ కిందట.. కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఫాతిమా బాబు ఇంటికి వెళ్లిన స్టాలిన్ ఆమెపై బలాత్కారం చేసి.. గోడ దూకి పారిపోయారని.. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారనే వార్తలున్నాయి. కాలక్రమేణా ఈ కేసుని ఆమె వెనక్కు తీసుకున్నారు. స్టాలిన్ నేర చరిత్ర ఇక్కడితో ఆగలేదు. దాదాపు 200 మంది మహిళలను లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నాయి. ఆయన గత రాజకీయంలో అనేక కోణాలున్నాయి. కొన్ని దారుణమైన నిజాలున్నాయి. నాడు తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు స్టాలిన్ దారుణమైన నేరాలు చేశారన్న అభియోగాలున్నాయి. ఈయన నేరాలకు నాడు తమిళనాడు అసెంబ్లీలో రోజుల తరబడి చర్చ జరిగి, ఆరోపణలు, వివాదాలతో నడిచేది. కానీ ఏదీ నిరూపితం కాలేదు. కొద్దీ కాలంలోనే చాలా కేసులను కొట్టేశారు.. ఇవన్నీ చూసుకుంటే ఇప్పటి స్టాలిన్ ఒరిజినల్ కాదు. ఆయన మార్పు చెంది ఉండాలి.. లేదా నటిస్తూ ఉండాలి. ఆయనది నటనా..? నిజమైనా మార్పా..? అనేది నిర్ధారించుకుని ముందు మరిన్ని అంశాలు తెలుసుకోవాలి..!

MK Stalin: Notorious Turned as Best CM.. Interesting Facts
MK Stalin Notorious Turned as Best CM Interesting Facts

ఇంటి ముప్పు.. రాజకీయ ముప్పు.. అన్నీ ఎక్కువే..!!

తమిళనాడు రాజకీయాలు కొన్ని దశాబ్దాల నుండి బాగా చూసిన వారికి స్టాలిన్ పాలన చాలా ఆశ్చర్యంగా, మిరకిల్ గా ఉంటుంది.. ప్రత్యర్థులపై కేసులు పెట్టుకుని.., తిట్టుకుని.., రాచి రంపాన పెట్టుకునే తమిళ రాజకీయాల్లో ఈ పరిపక్వ పాలన అందిస్తున్న స్టాలిన్ ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఉన్నారు. ఆయన ఎక్కడ దొరికినా.., ఏ మాత్రం అవకాశం ఇచ్చినా ఆయన సీటు లాక్కోడానికి ఆయనకు ఇంటి శత్రువులే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు, రాజకీయ ప్రత్యర్ధులు ఉండనే ఉన్నారు.

* ఇంటిముప్పు విషయానికి వస్తే… కరుణానిధి కుటుంబం చాలా పెద్దది. ఎంకే ముత్తు, ఎంకే స్టాలిన్, ఎంకే అలగీరి, ఎంకే తమిళరుసు, ఎంకే సెల్వి లు కరుణానిధి సంతానం. అంటే ఆయన రాజకీయ వారసులు. మురసోలి మారన్ (కరుణానిధి దగ్గరి బంధువు) వారసులు కూడా దశాబ్దాల నుండి డీఎంకే పార్టీలో నంబర్ వన్, టూ పొజిషన్ లో ఉన్నవారే..! కరుణానిధి వారసుల్లో స్టాలిన్ ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. మిగిలిన వారు ఆ పార్టీలోనే చురుగ్గా ఉన్నారు. మురుసోలీ మారన్ కుమారుడు దయానిధి మారన్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.., ప్రముఖ వ్యాపార వేత్తగా స్థిరపడ్డారు. ప్రముఖ టీవీ, మీడియా గ్రూపు (సన్ గ్రూపు) చైర్మన్ కళానిధి మారన్ చేతుల్లో ఉంది. మరో ప్రముఖ ఛానెల్ కళైగ్నర్ టీవీ కనిమొఝి చేతుల్లో ఉంది. అంటే స్టాలిన్ కుటుంబంలోనే అతని కంటే ఆర్ధికంగా, రాజకీయంగా ఉన్న వారు ఉన్నారు. స్టాలిన్ ఏ మాత్రం తప్పుకి దొరికినా కుర్చీ కోసం పార్టీలోనే తిరుగుబాటు రావడం ఖాయం. దయానిధి మారన్, కళానిధి మారన్ లు ఎన్నాళ్లని రెండోస్థానములో ఉండగలరు..!? కరుణానిధి తర్వాత ఈ మారన్ కుటుంబం ఆ పార్టీ కుర్చీపై కన్నేసి ఉంచింది..!

MK Stalin: Notorious Turned as Best CM.. Interesting Facts
MK Stalin Notorious Turned as Best CM Interesting Facts

ద్రవిడ సెంటిమెంట్ రగిల్చిన పార్టీ ఇదే..!

తమిళనాడులో రాజకీయం ఎప్పుడూ రంజుగా ఉంటుంది. అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో.., ప్రత్యర్థి పార్టీ కూడా క్షేత్రస్థాయిలో అంతే బలంగా ఉంటుంది. అన్నా డీఎంకే, డీఎంకే మధ్య దశాబ్దాల తరబడి ఈ రాజకీయం నడుస్తుంది. అన్నా డీఎంకే ఎంజీఆర్, జయలలిత ద్వారా సినీ సెంటిమెంట్, సినీ ఛరిష్మా, సామజిక కోణంలో జన బలం పొందగా.., డీఎంకే మాత్రం అసలైన ద్రవిడ పార్టీగా ప్రాంతీయత మూటగట్టుకుని బలం పోగేసుకుంది. ఆ ద్రవిడ లక్షణాలు, ఛరిష్మాయ మొత్తం డీఎంకే పైనే ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత స్టాలిన్ పై ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఏ మాత్రం తప్పులు దొర్లినా పార్టీ పునాదులకే ముప్పు వస్తుంది. పైగా స్టాలిన్ వారసుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అంత సమర్దుడేమి కాదు. పార్టీలో యూత్ విభాగం అధ్యక్షుడిగా.., ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈ చిన్న స్టాలిన్ పై కూడా చాలా నేరారోపణలు, అభియోగాలు ఉన్నాయి.
“ఓ వైపు తను ఇంటిముప్పుని, రాజకీయ ప్రత్యర్థుల ముప్పుని ఎదుర్కొని సీఎంగా కొనసాగాలి.. పాత ముద్రలు చెరుపుకోవాలి.. మరోవైపు తన వారసుడికి ఈ కుర్చీ దక్కేలా చేయాలి. చిక్కుముళ్లు, ముళ్ళ బాటలు తొలగించి అప్పగించాలి. ఇవన్నీ జరగాలంటే తాను మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలి. ప్రజాబలం పెంచుకోవాలి. అందరి మనస్సులో స్థిరపడాలి” సో.. ఇన్ని కారణాలతో స్టాలిన్ స్వీయ మార్పులు చేసుకుని.., స్వీయ గుణాత్ముడిగా మారి.., ఇన్ని సంస్కరణలు అమలు చేస్తున్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు..! స్టాలిన్ ది నటన కాదు,
బలవంతపు మార్పు కాదు.. కచ్చితంగా అవసరమైన.., పరిస్థితులు ప్రభావితం చేసిన స్వీయ మార్పు..!

author avatar
Srinivas Manem

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju