NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

ప్చ్ … పాపం..! ఇది విన్నారా..? రామోజీ ఆస్తి 2500 కోట్లేనట..!!

Ramojji Group of companies announce bonus to employees

పాపం..! తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు ఆస్తి జస్ట్ రూ. 2500 కోట్లేనట..! ఆయన కేవలం ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థకు మాత్రమే ఓనరట..! మరి డాల్ఫీన్ హోటల్స్, రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్స్, కళాంజలి షోరూంస్, ఉషా కిరణ్ మూవీస్, ప్రియా పచ్చళ్ళు… ఇవన్నీ ఎవరివి..? ఎవరి ఆస్తులన్నట్టు..? 1600 ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఫిలిం సిటీ విలువ ఎంత ఉన్నట్టు..? పాపం రామోజీని కేవలం రూ. 2500 కోట్లకు పరిమితం చేసి ఈ లెక్కలేసిన సంస్థ ఎంత పాపం మూటగట్టుకుందో..!!

తెలుగు నాట 62 మందితో జాబితా..!!

తెలుగు రాష్ట్రాల్లో టాప్ రిచెస్ట్ జాబితా నిన్న బయటకు వచ్చింది. వెల్త్ హురాన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 లో లిస్టు చూసి వహ్వా అని ముక్కున వేలేసుకున్న వారూ ఉన్నారు.., కాలర్ ఎగరేసిన వారూ ఉన్నారు. దీనిలో కులాలు కెలికి, మా కులస్తులే టాప్ లో ఉన్నారు అని లెక్కలుసుకుని.., సంబురాలు చేసుకున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఈ 62 మందికి చెందిన ఆస్తులను లెక్కేశారు. మొత్తం కలిపి రూ. 2 , 45 , 000 కోట్లు. అంటే అంబానీ ఒక్కడి ఆస్తిలో మూడో వంతు మాత్రమే. దీని ప్రకారం తెలుగు నాట దివీస్ లాబ్స్ అధినేత మురళి దివి కుటుంబం టాప్ లో ఉంది. రూ. 49 వేల కోట్లు ఆస్తి ఉంది. ఆ తర్వాత వరుసలో హెటేరో డ్రగ్స్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నారు. ఇదే జాబితాలో పాపం మన రామోజీరావు ఎక్కడో కింద ఉన్నారు. టాప్ 10 లో కూడా లేరు. అసలు విషయం ఏమిటయ్యా అంటే..!! ఈ రామోజీ బుర్ర, రామోజీ ఆస్తుల లెక్కలు ఆ లెక్కల సంస్థకి దొరకలేదన్నమాట..!!

ఉషోదయ మాత్రమే రామోజీ సంస్థా..??

రామోజీ అంటే పేద్ద వ్యాపార బుర్ర. ఆయన తన సామ్రాజ్యం మొదలు పెట్టింది మార్గదర్శి చిట్స్ తోనే. ఆ తర్వాత ప్రియా పచ్చళ్ళు పెట్టారు. తర్వాత ఈనాడు (ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ) పెట్టారు. కానీ ఈ సంస్థ కేవలం ఈనాడు లెక్కలను మాత్రమే వేసి, మిగిలినవి వదిలేసింది. రామోజీని చిన్నబుచ్చింది. ఫిలిం సిటీ విలువ కనీసం రూ. వేయి కోట్లు ఉండదా..?

ఇక ఏడాదికి రూ. 10 వేల కోట్లు టర్నోవర్ చూపిస్తున్న మార్గదర్శి.., డాల్ఫీన్ హోటళ్లు ., కళాంజలి షోరూంస్, విలువ ఏమవ్వాలి..? ఎంత ఉండాలి..? ఏమో.., రామోజీని చిన్నబుచ్చడానికి ఈ లెక్కల సంస్థ కంకణం కట్టుకుందేమో… సగమే లెక్కలు వేసి ప్రచురించేసింది. పోనీ బినామీ పేరిట ఉన్నవి వదిలేసినా… కొన్ని కుటుంబ సభ్యులకే ఉన్నాయి కదా..! డాల్ఫీన్ హోటళ్లు సుమన్ భార్యకు.., కళాంజలి ఒక కూతురుకి, ప్రియా పచ్చళ్ళు మరో కూతురికి, ఫిలిం సిటీ ఒకరికి, ఈనాడు, ఈటివి కిరణ్ కి… ఇలా అప్పగించారు. ఆ కుటుంబ సభ్యుల ఆస్తులు లెక్కేసినా మాంచి సంఖ్య ఉండేది. పాపం..!! రామోజీ మీకు 2500 కోట్లు మాత్రమే అంటే తెలుగు రాష్ట్రానికే అవమానం కాదయ్యా..!!

 

 

 

 

 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju